Tollywod Director: స్టార్ డైరెక్టర్ పని ఇక అయిపోయిందనుకున్న సమయంలో సాలీడ్ హిట్ తో కమ్ బ్యాక్..అందుకు కారణం వాళ్ళే..!

Share

Tollywod Director: ప్రతీ డైరెక్టర్‌కు హిట్ ఫ్లాప్స్ చాలా కామన్. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెంటిమెంట్స్ దృష్టిలో పెట్టుకొని ఓ భారీ ఫ్లాప్ వస్తే ..ఇక ఆ దర్శకుడిని నమ్మే నిర్మాతలు గానీ, హీరోలు గానీ ఉండరనే సందర్భాలు చాలానే చూశాము. అలా ఫేడవుట్ అయిన కొందరు దర్శకులు ..మొహమాటం కొద్ది మళ్ళీ ఎవరినీ అవకాశాలు అడగలేక సైలెంట్ అయ్యారు కూడా. అందుకు ఉదాహరణ వి.ఎన్.ఆదిత్యనే తీసుకోవచ్చు. మనసంతా నువ్వే, నేనున్నాను లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఆదిత్య ఆ తర్వాత బాస్ లాంటి ఫ్లాప్ సినిమాలు తీసి అడ్రస్ లేకుండా పోయారు.

tollywod-directors-who-have-come-back-with-solid-hit
tollywod-directors-who-have-come-back-with-solid-hit

అయితే గట్టి కసి పట్టుదలతో ఎలాగైనా మళ్ళీ ఓ భారీ సక్సెస్ కొట్టాలని ఓపికతో చేసిన ప్రయత్నాలు ఫలించి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన దర్శకులు మళ్ళీ లైమ్ లైట్‌లోకి వచ్చారు. వీళ్ళ గురించి అందరూ ఇక సినిమాలు తీయడం మానేసి వేరే పని చూసుకుంటే మంచిదనే కామెంట్స్ కూడా చేశారు. ఇండస్ట్రీలో సక్సెసే ముఖ్యం. దాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. భారీ హిట్స్ ఇచ్చిన విషయాన్ని ఇట్టే మర్చిపోయి ఫ్లాప్స్‌నే గుర్తుపెట్టుకొని దాన్ని చూపించే మొహం చాటేసిన వారు చాలామందే ఉన్నారు. ఇలాంటి పరాభవాలు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌కు కూడా ఎదురయ్యాయి.

Tollywod Director: బొమ్మరిల్లు భాస్కర్‌ను నమ్మి ప్రాజెక్ట్ ఇవ్వడం అంటే పెద్ద సాహసమే.

అలాంటి వారిలో ఇటీవల భారీ హిట్ కొట్టి మళ్ళీ సక్సెస్ చూసిన దర్శకులు గోపీచంద్ మలినేని, బొమ్మరిల్లు భాస్కర్, శ్రీకాంత్ అడ్డాల. వారిని హీరోలు నిర్మాతలు కొందరు నమ్మి అవకాశం ఇచ్చారు. గోపీచంద్ మలినేనికి గత మూడేళ్ళుగా హిట్ సినిమా లేదు. అంతకముందు ఆయన తీసిన సినిమాలు ఫ్లాపవడంతో మళ్ళీ సినిమా అవకాశం కోసం మూడేళ్ళు ఆగాల్సి వచ్చింది. ఆయనని మాస్ మహారాజ నమ్మాడు. దాంతో వీరి కాంబినేషన్‌లో క్రాక్ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి భారీ హిట్ సాధించింది. ఇక్కడ విశేషం ఏమిటంటే రవితేజకి కూడా హిట్ పడి మూడేళ్ళు అయింది. ఇప్పుడు ఈ క్రాక్ దర్శకుడికి బాలయ్య సినిమా ఆఫర్ ఉంది.

ఇక బొమ్మరిల్లు భాస్కర్ నుంచి సినిమా వచ్చి చాలాకాలం అయింది. ఈ దర్శకుడి పని అయిపోయిందని అందరూ మాట్లాడుకున్నారు. అదే ఫిక్స్ అయ్యారు. కానీ అనూహ్యంగా గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థలో దర్శకుడిగా అవకాశం అందుకున్నాడు. అఖిల్ – పూజా హెగ్డే జంటగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా రూపొందించి భారీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో మంచి కం బ్యాక్ అయ్యాడు. అసలే అఖిల్ నటించిన మూడు సినిమాలు ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో చేరాయి. అయినా అల్లు అరవింద్ గత కొంతకాలంగా హిట్ ఇవ్వని బొమ్మరిల్లు భాస్కర్‌ను నమ్మి ప్రాజెక్ట్ ఇవ్వడం అంటే పెద్ద సాహసమే. ఈ సినిమా మంచి వసూళ్ళు రాబడుతోంది.

Tollywod Director: వీరు ఇలా మళ్ళీ సక్సెస్ చూశారంటే ఆ క్రెడిట్ మన హీరోలు, నిర్మాతలకే దక్కుతుంది.

ఇక శ్రీకాంత్ అడ్డాల పని అయిపోయిందని అందరూ డిసైడయ్యారు. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి క్లాస్ హిట్స్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం సినిమాతో భారీ డిజాస్టర్ ఇచ్చాడు. దాంతో మళ్ళీ ఆయనకి ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు. కానీ విక్టరీ వెంకటేశ్, సురేశ్ బాబు నమ్మి అసురణ్ రీమేక్ నారప్ప సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు. వాళ్ళ నమ్మకాన్ని శ్రీకాంత్ అడ్డాల నిలబెట్టుకున్నాడు. నారప్పతో వెంకీకి భారీ హిట్ ఇచ్చి మళ్ళీ ఫాంలోకి వచ్చాడు. వీరు ఇలా మళ్ళీ సక్సెస్ చూశారంటే ఆ క్రెడిట్ మన హీరోలు, నిర్మాతలకే దక్కుతుంది.


Share

Related posts

ఇంటరెస్టింగ్ : కొల్లు రవీంద్ర బయటకి రాగానే ఏం జరగబోతోంది ?

sridhar

టిటిడి చైర్మన్‌గా వైవి సుబ్బారెడ్డి

somaraju sharma

సోషల్ మీడియాలో కరోనా రిపోర్ట్స్ పెట్టిన బండ్ల గణేష్…!!

sekhar