Tollywood CGI: గేమ్స్, సినిమాల్లో సీజీఐ ఎఫెక్ట్స్ యూజ్ చేసి కొత్త క్యారెక్టర్లను క్రియేట్ చేయడం, ప్లేస్ లను పూర్తిగా మార్చేయడం, ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా భ్రమ కలిగించడం జరుగుతూ ఉంటుంది. సీజీఐ అంటే కంప్యూటర్ జనరేటర్ ఇమేజరీ అని అర్థం. దీని సహాయంతో సినిమాలోని క్యారెక్టర్ల బాడీ, ముఖాన్ని కూడా చేంజ్ చేయచ్చు. వయసులో ఉన్న ముఖంపై ముడతలు వచ్చినట్లుగా, లేదా ముసలి వ్యక్తి కుర్ర వయసులో ఉన్నట్లుగా ఈ టెక్నాలజీ సాయంతో మనం స్క్రీన్ పై క్యారెక్టర్స్ చూపించవచ్చు. అయితే ఇప్పుడు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న దాదాపు అన్ని సినిమాల్లో సీజీఐ ఎఫెక్ట్స్ అంతర్భాగమైపోయాయి. మన టాలీవుడ్ లో హీరోల లుక్స్ గ్లామరస్ గా ఇంప్రూవైజ్ చేయడానికి కూడా సీజీఐ ఎఫెక్ట్స్ పైనే ఆధారపడుతున్నారు. తాజాగా విడుదలైన రెండు టాలీవుడ్ సినిమాల్లో హీరోల లుక్స్ చేంజ్ చేయడానికి సీజీఐ ఎఫెక్ట్స్ బాగా వాడారట. అయితే ఇందుకు భారీ రేంజ్ లో ఖర్చు అయినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
Tollywood CGI: సీజీఐ ఎఫెక్ట్స్
గతంలో హీరోలకు వయసు పైబడినా వారి మేకప్ లుక్స్ తోనే అడ్జస్ట్ అవుతూ సినిమాని ఎంజాయ్ చేసేవారు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు కాస్త వయసు పైబడినా ఆ హీరోల సినిమాలను పక్కన పెట్టేస్తున్నారు ప్రేక్షకులు. అందుకే తెరపై హీరోలు బాగా యంగ్ గా, అట్రాక్టివ్ గా కనిపించేందుకు దర్శకనిర్మాతలు తెగ కష్టపడుతున్నారు. గతంలో యంగ్‌గా కనిపించేందుకు హీరోలు కఠినమైన వర్కవుట్లు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి. దీనంతటికీ కారణం సీజీ అని చెప్పవచ్చు.
అక్షరాల రూ.13 కోట్లు
ముడతలు పడి బాగా లూజ్ అయిపోయిన హీరోల ఫేస్ స్కిన్ ఇప్పుడు యువకుడిలా కనిపించడానికి సీజీఐ కారణం. అయితే రీసెంట్ ఇయర్స్ వరకు ఒక సినిమా బడ్జెట్ లో సీజీఐ ఎఫెక్ట్స్ పై రూ.2 కోట్ల వరకు వెచ్చించేవారు. కానీ ఇప్పుడది రూ.10 కోట్లను దాటింది. తాజాగా విడుదలైన రెండు టాలీవుడ్ సినిమాల్లో హీరోల లుక్స్.. హీరోయిన్లకు మ్యాచ్ అయ్యేలా, యంగ్ & బ్యూటిఫుల్ గా కనిపించేందుకు సీజీఐపై రూ.13 కోట్లు ఖర్చు చేశారట. ముఖంపై ఉన్న ఫ్యాట్ మూవీలో ఎక్కడా కనిపించకుండా చేసేందుకే ఇలా 13 కోట్లు కట్ చేశారని తెలుస్తోంది. ఈ డబ్బులతో చిన్న, మిడిల్ రేంజ్ మూవీస్ తీయొచ్చు కూడా. అయితే ఎలాగూ కోట్ల ఖర్చు అవుతుంది కాబట్టి మెయిన్ లీడ్ రోల్ లుక్ అందంగా కనిపించేందుకు ఆ మాత్రం ఖర్చు చేయక తప్పదని నిర్మాతలు భావించినట్లు తెలుస్తోంది. అందుకే ఎప్పుడూ లేని విధంగా రూ.13 కోట్లు కేవలం ఫేస్ లుక్స్ చేంజ్ చేయడానికే ఖర్చు పెట్టినట్టు సోషల్ మీడియా, సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఆ హీరోలు ఎవరన్నది ఇటీవల రిలీజ్ అయిన సినిమాలు లిస్టుపై ఒక లుక్ వేస్తే తెలుస్తుంది. ఈ మూవీస్ లోని హీరోల లుక్స్, అలాగే ప్రెస్ మీట్స్ లోని వారి రియల్ లుక్స్ చూస్తే.. ఆ హీరోలు ఎవరన్నది తెలుసుకోవడం ఈజీ.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!