Tollywood Cinema: ప్రస్తుతం ఉన్న రోజులో సినిమా తీయడమనేది ఈజీ అయిపోయింది. కానీ దాన్ని ప్రమోట్ చేసి, సరైన సమయానికి రిలీజ్ చేయడం మాత్రం ఎంతో కష్టంగా మారింది. మంచి టైమ్ చూసుకుని రిలీజ్ అయిన చాలా సినిమాలు అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాన్ని పొందాయి. కానీ కొన్ని సినిమాలు టైమింగ్స్ చూసుకోకుండా రిలీజ్ అయ్యి బోల్తా పడ్డాయి. దసరా పండుగ సందర్భంగా పెద్ద సినిమాలు కొన్ని రిలీజ్ అయ్యాయి. వాటితో పోటీగా ‘స్వాతిముత్యం’ అనే సినిమాను రిలీజ్ చేసి బొక్క బోర్లా పడ్డాడు నిర్మాత నాగవంశీ.
Tollywood Cinema: టైమింగ్ ఇజ్ ఇంపార్టెంట్
అసలయితే స్వాతిముత్యం సినిమా బాగానే ఉంది కానీ ప్రేక్షకులకు దృష్టిలో పడలేకపోయింది. పెద్ద సినిమాలతో పోటీ పడకుండా… ఒక్క వారం ఆగి అక్టోబర్ మధ్యలో స్వాతిముత్యం సినిమా రిలీజ్ చేసి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదేమో. కానీ ఆ ఛాన్స్ ని కన్నడ సినిమా అయిన ‘కాంతారా’ మూవీ బాగా ఉపయోగించుకొని మంచి వసూళ్లు రాబట్టింది. ఇక దీపావళి కూడా అదే విధానాన్ని ఫాలో అయ్యారు డైరెక్టర్, నిర్మాతలు. ఒకేసారి ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఎం లాభం? అన్నిటికీ నష్టం జరిగింది. ఆ ఐదు సినిమాలలో ‘సర్దార్’, ‘బ్లాక్ ఆడమ్’ మంచి టాక్ సంపాదించాయి. మిగిలినవన్నీ దారుణంగా చతికిలపడ్డాయి. వాటిలో మంచు విష్ణు నటించిన ‘జిన్నా’ సినిమా తీవ్రంగా పరాజయం పాలయింది.
నష్టాలు తప్పవు
ఐదు సినిమాలు పోటీపడి ఒక్కసారే రిలీజ్ కాకుండా, వాటిలో కనీసం ఒక రెండు సినిమాలైనా ఆ వారం ఆగి ఇప్పుడు రిలీజ్ చేసి ఉంటే వాటికి ప్లస్ అయి ఉండేది. కానీ అలా చేయకుండా ఈ వారాన్ని ఖాళీగా వదిలేశారు. ‘ఊర్వశివో రాక్షసివో’, ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’, ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ లాంటి చాలా సినిమాలు వచ్చేవారం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇలా ఒకే వారంలో చాలా సినిమాలు పోటీపడి ఓడిపోవడం కంటే ఇంకో వారానికి షెడ్యూల్ని సెట్ చేసుకుంటే సినిమాలకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా కాకుండా పోటీకి దిగితే చేతులు కాల్చుకోవడం తప్ప మరేమీ మిగలదు.