Tollywood heroines: కెరీర్ క్లోజ్ అయ్యే సమయంలో ప్రయోగాలు చేస్తున్న హీరోయిన్స్..?

Share

Tollywood heroines: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఒక్కోసారి కొన్ని సినిమాలతో భారీ ప్రయోగాలు చేస్తుంటారు. ఆ ప్రయోగాలు ఎప్పుడు సక్సెస్ ఇస్తాయో.. ఎప్పుడు ఇబ్బందుల్లో నెడతాయో ఎవరూ చెప్పలేరు. ఇది దాదాపు అందరు హీరోయిన్స్ విషయంలో జరుగుతోంది. సినిమా ఇండస్ట్రీకొచ్చి 15 ఏళ్ళు దాటిన సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి. సూపర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన అనుష్క మొదటి సినిమాతో భారీ సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఆమెకు రాలేదనే చెప్పాలి.

tollywood-heroines-are doing experiments
tollywood-heroines-are doing experiments

కమర్షియల్ సినిమాలకు మంచి ఛాయిస్ అనిపించుకున్న అనుష్క నాగార్జున, వెంకటేశ్, రజనీకాంత్, మహేశ్ బాబు, ప్రభాస్, గోపీచంద్, సూర్య, బాలకృష్ణ ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించి సూపర్ హిట్స్ అందుకుంది. క్రేజీ హీరోయిన్‌గా మారిన ఆమె తెలుగుతో పాటు తమిళ సినిమాలలో నటించి స్టార్‌గా ఎదిగింది. ఇక శత చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో చేసిన అరుంధతి సినిమా అనుష్క కెరీర్‌లో గొప్ప సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమా తర్వాత అనుష్క చేసిన ప్రయోగాలు బెడిసికొట్టాయి. ముఖ్యంగా సైజ్ జీరో సినిమా తన కెరీర్‌ను తలకిందులు చేసిందనే చెప్పాలి.

Tollywood heroines: ప్రయోగాలు చాలా వరకు సక్సెస్ అవవనే టాక్ ఉంది.

ఇలాంటి సమయంలో కూడా అనుష్క నిశ్శబ్ధం లాంటి సినిమా చేయడం అంటే పెద్ద రాంగ్ స్టెప్ వేసినట్టే అనుకోవాలి. దీని తర్వాత మళ్ళీ ఆమె కొత్త మూవీ ఏదీ ప్రకటించలేదు. ఇప్పుడు బొద్దుగుమ్మ హన్సిక కూడా ఇలాంటి ప్రయోగాలే చేస్తోంది. దేశముదురు సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె మంచి హిట్స్ అందుకుంది. ఇక్కడ కాస్త జోరు తగ్గగానే తమిళ ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ మంచి ఫాం కొనసాగించింది. అయితే గతకొంతకాలంగా హన్సికకు హిట్స్ దక్కడం లేదు. ఆమె సినిమాలను చూసేందుకు జనాలు అంతగా ఆసక్తి చూపించడం లేదు.

ఇలాంటి సమయంలో మంచి కమర్షియల్ సినిమా చేసి ఓ గట్టి హిట్ కొట్టి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలనుకుంటారు. కానీ ఆమె మాత్రం 105 మినిట్స్ అనే సినిమాతో పెద్ద ప్రయోగమే చేస్తోంది. సింగిల్ టేక్ లోనే ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసినట్టు చిత్రబృందం తెలిపింది. ఇది ఇప్పటి వరకు హాలీవుడ్‌లనే సాధ్యపడలేదు. మరి ఇక్కడెలా సాధ్యపడుతుందనేది ఎవరీ అర్థం కాని ప్రశ్న. ఇందుకోసం వాడిన టెక్నాలజీ ఏంటో..అసలు ఆ సినిమా ఎలా ఉంటుందో అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి ప్రయోగాలు చాలా వరకు సక్సెస్ అవవనే టాక్ ఉంది.

Tollywood heroines: ఇక్కడ ఒక్కసారి ఫేడౌట్ అయితే మళ్ళీ అవకాశాలు రావడం చాలా కష్టం.

ఇక రకుల్ కూడా ఫాం కోల్పోతున్న సమయంలో నాగార్జునతో మన్మధుడు 2 అనే సినిమా చేసి గట్టి దెబ్బతినింది. ఈ సినిమా చేయకుండా ఉంటేనైనా కాస్త జనాలలో ఉన్న క్రేజ్ తగ్గేది కాదేమో. ఆ తర్వాత చేసిన చెక్ సినిమా కూడా ఆమె అనవసరంగా ఒప్పుకుంది. వీరి మాదిరిగానే చాలామంది హీరోయిన్స్ గతంలో ఏదో ప్రయోగం చేసి ఫ్లాప్ రావడంతో మళ్ళీ కనిపించకుండా పోయారు. ఇప్పుడు వారిలో కొంతమంది స్మాల్ స్క్రీన్ మీద సందడి చేస్తుంటే కొందరు వయసుమళ్ళిన పాత్రలు వచ్చిన చేయాలనే తాపత్రయంతో ఉన్నారు. కానీ ఇక్కడ ఒక్కసారి ఫేడౌట్ అయితే మళ్ళీ అవకాశాలు రావడం చాలా కష్టం.

 


Share

Related posts

బ్రేకింగ్: స్థానిక పోరు పిటిషన్‌ విచారణ వాయిదా

somaraju sharma

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో బ్లాక్ బస్టర్ కోసం సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న హరీష్ శంకర్..!!

sekhar

వింత చావు: కారు డోరులో చిక్కుకొని మహిళ మృతి!

Teja