Ananya pandey : అనన్య పాండే బాలీవుడ్ లో ఇప్పటికే రెండు సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్స్ అందుకున్నాయి. దాంతో హాట్ బ్యూటీగా అనన్య కి బాలీవుడ్ ప్రేక్షకుల్లో అలాగే మేకర్స్ లో భారీ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. ఇలాంటి హీరోయిన్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ పూరి జగన్నాధ్ చేతిలో పడితే ఇంకెలా ఉంటుందో ఒక సారి ఊహించుకోవచ్చు. టాలీవుడ్ కి పూరి జగన్నాధ్ ఒక హీరోయిన్ ని పరిచయం చేస్తున్నాడంటే టాలీవుడ్ మేకర్స్ తో పాటు స్టార్ హీరోల దృష్ఠి మొత్తం ఆ హీరోయిన్ మీదే ఉంటుంది.
అలా పూరి పరిచయం చేసిన వాళ్ళు ఎంతమంది స్టార్ హీరోయిన్స్ అయ్యారో అందరికీ తెలిసిందే. ఆ లిస్ట్ లో ఇప్పుడు అనన్య పాండే చేరింది. ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా లైగర్. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తెలుగు తో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతోంది. కాగా ప్రసుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోందట.
Ananya pandey : అనన్య పాండే డేట్స్ లాక్ చేసే పనిలో టాలీవుడ్ మేకర్స్..?
రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా తండ్రి – కొడుకుల సెంటిమెంట్ ప్రధానంగా పక్కా పూరి జగన్నాధ్ మార్క్ తో తెరకెక్కుతోందని సమాచారం. ఇక ఈ సినిమా టైటిల్ అండ్ ట్యాగ్ లైన్ సినిమా మీద భారీగా అంచనాలు పెంచేసింది. దాంతో ఇప్పుడు చాలా మందు మేకర్స్ లైగర్ బ్యూటీ అనన్య పాండే డేట్స్ లాక్ చేసే పనిలో పడినట్టు తెలుస్తోంది. అంతేకాదు అనన్య కి ఎక్కువ పెద్ద నిర్మాణ సంస్థలు.. స్టార్ హీరోల సినిమాలే లైన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.