నభా నటేష్ ఇలా కమిటవుతోంది కాబట్టే టాలీవుడ్ మేకర్స్ వెంటపడుతున్నారట ..?

Share

నభా నటేష్ ప్రస్తుతం వరస సినిమాలతో యమా జోరు మీద ఉంది. ఏమంటూ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ అంటూ ఊర మాస్ క్యారెక్టర్ లో చూపించాడో అప్పటి నుంచి టాలీవుడ్ లో నభా నటేష్ కి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. చెప్పాలంటే నభా నటేష్ మంచి టాలెంటెడ్ హీరోయిన్. మంచి లవ్ స్టోరీస్ చేసే అవకాశాలు రావాలే గాని టాలీవుడ్ లో మంచి క్రేజీ హీరోయిన్ గా మారిపోతుంది. అంతేకాదు నభా నటేష్, నాని, నితిన్, అల్లు అర్జున్, సాయి ధరం తే, వైష్ణవ్ తేజ్ .. ఇలా యంగ్ హీరోలందరికి పర్ఫెక్ట్ జోడీ. యాక్టింగ్ పరంగా కూడా ప్రేక్షకులను అలాగే మేకర్స్ ని బాగా ఆకట్టుకుంటోంది.

Nabha-Natesh-from-'iSmart-Shankar'-'Dimaak-Kharaab'-song-shoot-1668 |  Actresses, Actress photos, Songs

నన్ను దోచుకుందువటే, అదుగో సినిమాలలో హీరోయిన్ గా గుర్తింపు పొందిన నభా నటేష్ కి పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ మాత్రం మంచి లాంగ్ టైం కెరీర్ ని ఇచ్చింది. అందుకే వచ్చిన అవకాశాలలో తన కి సూటయ్యే సినిమాలని కెరీర్ పరంగా ది బెస్ట్ అని చెప్పుకునే సినిమాలనే ఒప్పుకుంటోంది. ఇక్కడ నభా నటేష్ గురించి అందరూ ఆసక్తిగా చెప్పుకుంటుంది తనలోని టాలెంట్. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఎంత మాస్ క్యారెక్టర్ చేసిందో .. సాయి ధరం తేజ్ తో నటించిన తాజా చిత్రం సోలో బ్రతుకే సో బెటర్ లో పూర్తి భిన్నంగా మంచి క్లాస్ క్యారెక్టర్ లో కనిపించబోతోందట.

Solo Brathuke So Better Hey Idi Nenena (8D AUDIO) | Sai Tej | Nabha Natesh  - YouTube

ఈ క్వాలిటీ ఉండబట్టే ఇప్పుడు తెలుగులో ప్రముఖ దర్శక, నిర్మాతలు డేట్స్ కోసం నభా నటేష్ వెంట క్యూ కడుతున్నారని చెప్పుకుంటున్నారు. మాస్ అయినా క్లాస్ అయినా నభా సూపర్బ్ గా చెస్తుందన్న టాక్ ఇప్పటికే తెచ్చుకుంది. హీరోలు కూడా నభా నటేష్ ని తమ సినిమాలలో బాగానే రిఫర్ చేస్తున్నారట. ప్రస్తుతం నభా నటేష్ సోలో బ్రతుకే సో బెటర్ ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక నితిన్ తో బాలీవుడ్ హిట్ సినిమా అంధాదున్ తెలుగు రీమేక్ లో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో కూడా జాయిన్ అయింది. ఈ సినిమాలో మంచి గ్లామర్ రోల్ చేస్తోందని సమాచారం. ఇవి కాక మరికొన్ని ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయని తెలుస్తోంది.


Share

Related posts

Lemon: నిమ్మకాయలను ఫ్రిజ్లో పెట్టి ఉపయోగిస్తున్నారా..!? అయితే ఇది తెలుసుకోండి..

bharani jella

Sreemukhi : నానమ్మతో రాములమ్మ తంటా… శ్రీముఖి లేటెస్ట్ వీడియో అదుర్స్?

Varun G

అలా చేస్తే ప్రధాని మోడీ కి చేతులెత్తి మొక్కుతా అంటున్న కేటీఆర్..!!

sekhar