Tollywood Movies: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద భారీ ఫైట్స్ చూసి సంవత్సరం దాటేసింది. ఇంకా చెప్పాలంటే మరో నాలుగైదు నెలలు కూడా ఇలాగే ఉంటుంది. ఇదంతా 2022 బాక్సాఫీస్ వద్ద ఉండబోతోంది. ఇన్ని నెలలుగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాలన్ని వరుసగా రిలీజ్ డేట్‌ను ప్రకటించాయి. ఇంకా కొన్ని సినిమాలు ప్రకటించాల్సి ఉంది. అయితే ఇంతకముందెన్నడు లేని భారీ పోటీ మొదటి సారి 2022 సంక్రాంతికి ఉండబోతోంది. అయితే ఎవరు ఎవరిని టార్గెట్ చేసి ఈ బరిలో దిగుతున్నారో అనేది ఇప్పుడు అటు ఇండస్ట్రీ వర్గాలలో ఇటు ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది.

వాస్తవంగా సంక్రాంతి బరిలో దిగుతున్నట్టు ముందు ప్రకటించింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ – ఏ ఎం రత్నం కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పీరియాడికల్ మూవీ హరి హర వీరమల్లు. ఈ సినిమా ఫస్ట్ టీజర్ వదిలినప్పుడే సంక్రాంతికి వస్తున్నట్టు ప్రకటించారు. కానీ డేట్ మాత్రం వెల్లడించలేదు. అయితే ఇప్పుడు హరి హర వీరమల్లు కాకుండా భీంలా నాయక్ సినిమాను దింపుతున్నాడు. పవన్ కళ్యాణ్‌కి కరోనా రావడంతో ఆయన నటిస్తున్న రెండు సినిమాలు షూటింగ్ దశలో ఆగిపోయాయి. అయితే సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్‌ను 2022 సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నారు.
Tollywood Movies: భారీ రేంజ్‌లో పోటీకి దిగుతున్నారు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – మెగా పవర్ స్టార్ రాం చరణ్.
అయితే సూపర్ స్టార్ మహేశ్ బాబు – కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాను 2022, సంక్రాంతి జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. వాస్తవంగా పవన్ కళ్యాణ్ – మహేశ్ బాబుకి మధ్య గట్టి పోటీ ఉంటుందని, ఇద్దరి మధ్య భారీ ఫైట్ ఉంటుందని అనుకున్నారు. కాని ప్రభాస్ తన పాన్ ఇండియన్ సినిమా రాధే శ్యాం తో వస్తున్నట్టు ప్రకటించి షాకిచ్చాడు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన రాధే శ్యాం కరోనా కారణంగా, ఇతర కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ ఈ ఏడాది జూలై 30న రిలీజ్ చేస్తామని వెల్లడించారు.
కానీ మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బ కొట్టడంతో ఏకంగా 2022 సంక్రాంతి జనవరి 14న రిలీజ్ డేట్ ని ప్రకటించి మహేష్ – పవన్‌కి పోటీగా దిగుతున్నారు. ఇదే కాకుండా వెంకటేశ్ – వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ ఎఫ్ 3 కూడా సంక్రాంతి బరిలో దిగుతున్నట్టు స్వయంగా వెల్లడించాడు. కానీ ఇంకా ఎఫ్ 3 రిలీజ్ డేట్ ప్రకటించలేదు. కానీ పక్కా సంక్రాంతికి మాత్రం వస్తున్నారు. వీరందరికీ భారీ రేంజ్‌లో పోటీకి దిగుతున్నారు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – మెగా పవర్ స్టార్ రాం చరణ్. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఫిక్షనల్ డ్రామా ఆర్ఆర్ఆర్ జనవరి 8న రిలీజ్ చేసే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి.
Tollywood Movies: ఆర్ఆర్ఆర్ అందరికీ సాలీడ్ రేంజ్‌లో పోటీ ఇవ్వడం ఖాయం అంటున్నారు.
ఇదే నిజమైతే ఆర్ఆర్ఆర్ అందరికీ సాలీడ్ రేంజ్‌లో పోటీ ఇవ్వడం ఖాయం అంటున్నారు. ఒకవేళ జనవరి 8న వస్తే సంక్రాంతి సమయానికి దాదాపు వసూళ్ళు రాబట్టి కొంతలో కొంత సైడ్ ఇవ్వొచ్చు. లేదా అప్పటి పరిస్థితులను బట్టి పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పలేము. ఇక పవన్ కళ్యాణ్ – ప్రభాస్ – మహేష్ బాబు – వెంకటేష్, వరుణ్ లు ఎవరెవరికి ఎవరు పోటీ ఇస్తారనేది సస్పెన్స్‌గా మారింది. అయితే అందరికి పోటీ ఇచ్చేది మాత్రం పవన్ కళ్యాణ్ అని టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి 2022 సంక్రాంతికి బాక్సాఫీస్ ఏ రకంగా షేకవుతుందో.