గత నెలలో మేజర్, విక్రమ్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలు ప్రేక్షకులను బాగా అలరించాయి. అయితే జూన్ నెలలోనే విడుదలైన అంటే సుందరానికి, విరాటపర్వం మూవీలు మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అయితే ఈ నెలలో ఏయే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి? ఏ సినిమా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
జులైలో ఆ ముగ్గురు హీరోల మధ్య తీవ్ర పోటీ
పందెంకోడి మూవీ ఫేమ్ లింగస్వామి డైరెక్ట్ చేసిన యాక్షన్ కామెడీ మూవీ “ది వారియర్” జులై 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో రామ్ పోతినేని, ఆది పినిశెట్టి, కృతి శెట్టి, అక్షర గౌడ, నదియా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. సినిమాలు సత్య (రామ్) కర్నూల్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు స్వీకరించి, నగరంలో గురు అనే పేరుమోసిన గ్యాంగ్స్టర్ అంతం చూస్తాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాతో పాటు మరో ఇద్దరు హీరోల సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి.
బాక్సాఫీస్ దద్దరిల్లడం ఖాయమా
నాగచైతన్య హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ ఫిలిం ‘థాంక్యూ’ జులై 22న రిలీజ్ అవుతోంది. పక్కా క్లాస్ & ఫ్యామిలీ మూవీగా వస్తున్న ఈ సినిమా యూత్ ని ఆకట్టుకునే అవకాశం ఉంది. విక్రమ్ కె.కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రాశిఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ నటించారు. యువతను బాగా ఆకట్టుకునే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లను రాబట్టవచ్చు.
జులై 29న రవితేజ మూవీ రామారావు ఆన్ డ్యూటీ కూడా రిలీజ్ కానుంది. ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. అదే జరిగితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కాసుల వర్షం కురిపించవచ్చు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?