Chalapathirao: టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూశారు. ఈరోజు తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో చనిపోయారు. చలపతిరావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. చలపతిరావు 1200లకు పైగా సినిమాల్లో నటించారు.

1944 మే 8న చలపతిరావు జన్మించారు. కృష్ణ జిల్లా పామర్రు మండలం బల్లిపర్రులో ఆయన జన్మించారు. ఆయనకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చలపతిరావు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. చలపతిరావు కుమారుడు రవిబాబు కూడా నటుడు, దర్శకుడుగా సిని ఇండస్ట్రీలో ఉన్నారన్న సంగతి అందరికి తెలిసిందే. చలపతిరావు ఆయన కుమారుడు వద్ద ఉంటున్నారు. గతకొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. చలపతిరావు మరణ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు ఆయన నివాసం వద్దకు చేరుకుని ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.