tollywood: మహమ్మారి కరోనా వైరస్ కారణంగా సినిమా వ్యాపారానికి బాగా చిల్లు పడింది. గత ఏడాది సమ్మర్ అదే రీతిలో ఈ ఏడాది సమ్మర్ కి విడుదల కావాల్సిన చాలా సినిమాలు.. రిలీజ్ కాకుండా మిగిలిపోయాయి. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు.. థియేటర్లు మూత పడటంతో.. ఎవరు ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన అనేక సినిమాలు.. విడుదల కాకుండానే .. సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని మిగిలిపోయాయి.
ఈ క్రమంలో కొంతమంది నిర్మాతలు ..ఓటిటీ లో రిలీజ్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా సరిగ్గా గత ఏడాది ఏప్రిల్ మాసంలో రిలీజ్ అవుతుందని అందరూ భావించిన క్రమంలో కరోనా వైరస్ రావటంతో.. ఒక్కసారిగా లెక్కలు మొత్తం తారుమారయ్యాయి.
Read more: Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీ ని పరేషాన్ చేస్తున్న ఏపీ ప్రభుత్వం కొత్త జీవో..!!
ఇదిలా ఉంటే ఇప్పుడు లవ్ స్టోరీ సినిమా అదే రీతిలో నాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ సినిమా ఆగస్టు నెలలో వారం వ్యవధిలో రెండు సినిమాలు విడుదల అవటానికి సిద్ధమయ్యాయి. ఆగస్టు 7వ తారీకు లవ్ స్టోరీ రిలీజ్ అవుతుండగా.. ఆగస్టు 13వ తారీకు నాని నటించిన “టాక్ జగదీష్” రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలు ఎప్పుడో రిలీజ్ కావల్సి ఉండగా ఎట్టకేలకు ప్రభుత్వాలు ఇటీవల సినిమా థియేటర్లకు ఓపెన్ చేసుకునే అవకాశం.. వెసులుబాటు కల్పించటంతో ఆగస్టు మాసంలో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.