Tollywood: ఇండస్ట్రీలో ఇప్పటివరకు చిత్రీకరించిన సినిమాలలో ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్లలో ఒకరు అనిల్ రావిపూడి. కామెడీ నేపథ్యంలో కమర్షియల్ ఎంటర్టైనర్ తరహాలో సినిమాలు తెరకెక్కించడం.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే రీతిలో సినిమాలు తెరకెక్కిస్తూ అనిల్ రావిపూడి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించడం జరిగింది. పటాస్, F 2.. సినిమాలతో అదిరిపోయే విజయాలు సాధించిన.. అనిల్ రావిపూడి గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమా.. చేసి అదిరిపోయే విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం జరిగింది.
మహేష్ కెరీర్లోనే సరిలేరు నీకెవ్వరు సినిమా రికార్డు స్థాయి ఓపెనింగ్ కలెక్షన్లు రాబట్టింది. అటువంటి అనిల్ రావిపూడి ప్రస్తుతం f3 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకటేష్ వరుణ్ తేజ్ నటిస్తున్న ఈ సినిమాలో.. సరికొత్త కామెడీ జోనర్ స్క్రిప్టుతో మరోసారి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి అనిల్ రావిపూడి రెడీ అవుతున్నాడట.
Read more: Tollywood: నాలుగు సినిమాలు ఒకేసారి చేస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో..??
ఇదిలా ఉంటే ఈ సినిమాలో దాదాపు ఎనిమిది మంది హీరోయిన్లతో సరికొత్త ప్రయోగం చేయడానికి డైరెక్టర్ డిసైడ్ అయినట్లు వీరిలో ఒక హీరోయిన్ గా రష్మిక మందన కన్ఫర్మ్ అయినట్లు సరికొత్త వార్త ఇప్పుడు ఇండస్ట్రీ లో వైరల్ అవుతుంది. ఏకంగా ఎనిమిది మంది హీరోయిన్లు ఈ సినిమాలో కనిపించే రీతిలో అనిల్ రావిపూడి ప్లాన్ చేయటంతో ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల లో వైరల్ అవుతుంది.