ప్రస్తుతం సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లో అగ్రహీరోయిన్లు అనగానే మనకి ముందుగా గుర్తువచ్చే పేర్లు అనుష్క శెట్టి మరియు సమంత అక్కినేని. సమంత – Samantha తన మొదటి సినిమ ‘ఏ మాయ చేశావే’ తో తెలుగు తెర మీద మెరిసి తెలుగు ప్రేక్షకుల మన్ననలను సంపాదించుకుంది. ఆ తర్వాత సమంత కెరీర్ లో వెనుతిరిగే ప్రసక్తే లేకుండా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. సమంత పెళ్లి తరువాత కేవలం లేడీ ఓరియంటెడ్ సినిమాలలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే సమంత ఏ సినిమాలో నటించినా తన కో – యాక్టర్ల కన్నా ఆమెకే ఎక్కువగా ప్రాధాన్యత లభిస్తుంది. ఉదాహరణకు ఆమె నటించిన జాను చిత్రం.
కాబట్టి సమంత నటించిన ప్రతి చిత్రం లోనూ హైలెట్ గా నిలుస్తూ ఉండడంతో తనతో నటించే వారి ప్రాముఖ్యత కూడా ఆమెకే దక్కుతుంది. ఈ కారణంతోనే అగ్ర హీరోలు కానీ మిడిల్ రేంజ్ హీరోలు కానీ ఎవ్వరూ సమంత నటిస్తున్న సినిమాల్లో నటించడానికి సాహసం చెయ్యట్లేదు. సమంత నటిస్తున్న సినిమాలలో నటిస్తే తమకు కెరీర్ పరంగా ఒరిగేది ఏమి ఉండదని చెబుతూ సమంతా నటించనున్న సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న శాకుంతలం సినిమాలో దుష్యంతుడి రోల్ లో ఒక హీరో ని ఫిక్స్ చేయాలని గుణశేఖర్ ఎంతో ప్రయత్నిస్తున్నారు. కానీ టాలీవుడ్ హీరోలు మరో ఆలోచన లేకుండా శాకుంతలం సినిమాని రిజెక్ట్ చేస్తున్నారు. ఇక దీనితో గుణశేఖర్ చేసేదేమీ లేక ఒక మలయాళ హీరో ని దుష్యంతుడి పాత్ర కోసం సెలక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ లో మరో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి పరిస్థితి కూడా ఇలానే కనిపిస్తుంది. అనుష్క ఇటీవల నటించిన నిశ్శబ్దం సినిమాలో తన కో-స్టార్ మాధవన్ కి ఎటువంటి గుర్తింపు లభించలేదు.
వీరు నటించే ప్రతి సినిమాలోను వీరికి తప్ప తమకు గుర్తింపు లభించట్లేదని టాలీవుడ్ హీరోలు భావిస్తూ వీరి సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారు.