Tollywood vs Bollywood : హిందీ చిత్రాలకి ఎదురెళుతున్న తెలుగు సినిమాలు..! ఆ నాలుగింటిలో విజయం ఎవరిది?

Share

Tollywood vs Bollywood : గత రెండు సంవత్సరాల్లో టాలీవుడ్ రేంజ్ భారీగా పెరిగిపోయింది. ‘బాహుబలిసినిమా చూసిన రాజమౌళి కథలో విషయం ఉండి ఎక్కువ బడ్జెట్ పెట్టగలిగే సత్తా తో క్వాలిటీ సినిమా తీస్తే వసూళ్ళు కూడా కచ్చితంగా తిరిగి రాబట్టగలం అనేది ధైర్యాన్ని అందరికీ పుట్టించాడు. దీంతో టాలీవుడ్ స్టార్స్ కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ను నమ్ముకుని మన దగ్గర ఉన్న కంటెంట్ పై భరోసాతో నిర్మాతలు కోట్లు కుమ్మరిస్తున్నారు. 

 

Tollywood vs Bollywood hindi vs telugu
Tollywood vs Bollywood hindi vs telugu

అందుకే ఇప్పుడు పాన్ ఇండియా సందడి టాలీవుడ్ లో ఎక్కువ అయిపోయింది. స్టార్ హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నాయి. తెలుగు సినిమాలు అంటే వాటితో ఢీ కొట్టేందుకు ఇతర భాషల సినిమాలు భయపడుతున్నాయి. మన సినిమాలు అన్ని భాషల్లో ఇంత తక్కువ వ్యవధిలో ఎక్కువగా విడుదల కావడం శుభపరిణామమే. అయితే భారత చలన చిత్ర సీమకు పెద్దన్న బాలీవుడ్ నుండి మాత్రం టాలీవుడ్ కి గట్టి పోటీ ఎదురు కాబోతోంది. 

వివరాల్లోకి వెళితేజూలై 2వ తేదీన అడవి శేష్ హీరోగా నటిస్తున్నమేజర్చిత్రం విడుదల అవుతోంది. ఈ సినిమాకి మహేష్ బాబు కి చెందిన జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ సంస్థ గా వ్యవహరిస్తోంది. అయితే అదే రోజునషేర్షాచిత్రం బాక్సాఫీస్ ను ఢీ కొట్టబోతోంది. మరో విశేషం ఏమిటంటే ఈ రెండూ దేశభక్తి నేపథ్యంలో నడిచే చిత్రాలే. 

అలాగే జూలై 30వ తేదీన రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటించినరాధే శ్యామ్చిత్రం విడుదల అవుతోంది. ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే అదే రోజున సంజయ్ లీలా భన్సాలీగంగూభాయ్ కథియావాడిచిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఆలియాభట్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కొద్ది గంటల క్రితమే విడుదలైంది. సంజయ్ లీలా భన్సాలీ ఎంత పెద్ద డైరెక్టర్ అనే విషయం అందరికీ తెలిసిందే. అతని సినిమాలు అతి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంటాయి. 

ఇక ఇవన్నీ పక్కన పెడితే ఆగస్టు 13వ తేదీన అల్లుఅర్జున్పుష్పరిలీజ్ అవుతోంది. బాలీవుడ్ లో కూడా ఈ సినిమాను విస్తృతంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే అదే రోజున జాన్ అబ్రహామ్అటాక్సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతోంది. ఇక అక్టోబర్ 13వ తేదీన రాజమౌళి దర్శకత్వంలోఆర్ఆర్ఆర్చిత్రం విడుదల అవుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులు అన్న విషయం తెలిసిందే. 

అయితే అక్టోబర్ 15వ తేదీన అజయ్ దేవగణ్ హీరోగామైదాన్విడుదలవుతోంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే అజయ్ దేవగణ్ఆర్ఆర్ఆర్సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ సంవత్సరంలోనే ఇలా టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ పోరులు నాలుగు ఉన్నాయి. మరి చివరికి ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి. 


Share

Related posts

ఆర్ఎస్ ఎస్ సంకల్ప్ రథయాత్ర ప్రారంభం

Siva Prasad

IND vs SL: అందరూ భారత క్రికెట్ జట్టు పై పడి ఏడ్చేవాళ్ళే…

arun kanna

ఉప ప్రధాని రేసులో తెలంగాణ సీఎం కేసీఆర్.. అందుకే జగన్ కు మద్దతు.. ఇక జాతీయ రాజకీయాల్లో పాగా?

Varun G