29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
న్యూస్ హెల్త్

Screen: స్క్రీన్ స్పేస్ ఎక్కువైతే ఈ సమస్యలు తప్పవు..

too much screen space effects on your body
Share

Screen: నేటి ఆధునిక జీవన విధానం లో స్క్రీన్ సమయం పెరిగిపోతుంది. స్మార్ట్ ఫోన్ల వాడకం, లాప్టాప్ పై ఉద్యోగ పనులు, టీవీ చూడటం, ఇవన్నీ కూడా ఒక మనిషి జీవితంలో స్క్రీన్ సమయాన్ని అమాంతం పెంచేస్తున్నాయి. అయితే స్క్రీన్ స్పేస్ ఎంత ఎక్కువ అంతగా ఎక్కువ కంటి సమస్యలే వస్తాయని అనుకుంటారు. అంతేకాదు.. పెరుగుతున్న స్క్రీన్ నుంచి వచ్చే కాంతి కళ్లపైనే కాదు చర్మం, జుట్టుపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పరిశోధకులు వెల్లడించారు..

too much screen space effects on your body
too much screen space effects on your body

తాజాగా చేసిన అధ్యయనం ప్రకారం.. ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా విడుదలయ్యే కాంతి… మానవ చర్మ కణాలను దెబ్బతీస్తుందని ఈ అధ్యయనం తేల్చింది.. ఈ కాంతి మానవ చర్మం పై పడి ‘రియాక్టివ్ ఆక్సిజన్ జాతులు’ ఉత్పత్తి అయ్యేందుకు దారితీస్తుంది. దీనివల్ల ఎక్కడైతే కాంతి అధికంగా పడుతుందో ఆ ప్రాంతంలోని కణాల మరణానికి కారణం అవుతుంది అని పరిశోధకులు వెల్లడించారు.

ఎలక్ట్రానిక్ పరికరాలలో బ్లూ లైట్ అధికంగా వెలుగునిస్తుంది. ఈ నీలి కాంతి హై ఎనర్జీ విజిబుల్ అని కూడా పిలుస్తారు. స్పెక్ట్రమ్లో ఇతర రంగుల కంటే బ్లూ లైట్ ఎక్కువ శక్తిని కలిగి ఉంది. ఈ బ్లూ లైట్ వల్ల మానవ కణాలు డ్యామేజ్ అవకాశం ఎక్కువ.  స్క్రీన్ వైపు చూస్తున్నప్పుడు కళ్ళు పొడిబారడం జరుగుతూనే ఉంటుంది. ఆ సమయంలో మనం గుర్తించక పోయిన చర్మం కూడా పొడిబారుతుంది.

తాజా అధ్యయనాలు ప్రకారం స్మార్ట్ ఫోన్, లాప్టాప్లపై నిరంతరం పనిచేయడం వల్ల జుట్టు పొడిబారడం, జుట్టు రాలిపోవడం కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం ఒత్తిడి అని అంటున్నారు. స్క్రీన్ ఎక్కువ సేపు చూస్తే దను నుండి వెలువడే నీలిరంగు కాంతి.. జుట్టు పెరుగుదలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. వెంట్రుకల కుదుళ్లకు హాని కలిగిస్తుంది. స్క్రీన్ ఎక్కువ సేపు చూసేటప్పుడు ఒకే భంగిమలో మనిషి అధిక సమయం కూర్చుంటాడు. ఇది శరీరంలో ఒత్తిడికి కారణం అవుతుంది. ఎక్కువ సేపు స్క్రీన్ చూస్తే జుట్టు, చర్మ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో పూర్తిగా అర్థం చేసుకోవడానికి మరింత పరిశోధన అవసరమని అంటున్నారు శాస్త్రవేత్తలు.


Share

Related posts

ఏపి సీఎస్ రేసులో అనూహ్యంగా కొత్త పేరు ..! సీఎం జగన్ తో ఆ కేంద్ర అధికారి భేటీ అందుకేనా..!?

somaraju sharma

Today Horoscope: ఫిబ్రవరి 4 – మాఘ మాసం – రోజు వారీ రాశి ఫలాలు

somaraju sharma

Samantha: సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ పాత్రలో సమంత..!!

sekhar