బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ తో పాటు దేశమంతా దీపిక పదుకొణె కి స్టార్ హీరోయిన్ గా విపరీతమైన క్రేజ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. పద్మావత్, భాజీరావ్ మస్తానీ లాంటి పీరియాడికల్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా నేషనల్ వైడ్ గా పాపులారిటీని సాధించింది. అందుకే ప్రస్తుతం ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా ఎంచుకున్నారు. టాలీవుడ్ లో దీపిక నటించబోతున్న మొదటి సినిమా. ఇంతలోనే డ్రగ్స్ వ్యవహారంలో ఇరుక్కొని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ని షాక్ కి గురి చేసింది. కొంతమందైతే ఇక టాలీవుడ్ సినిమాలకి బాలీవుడ్ హీరోయిన్స్ ని తీసుకోవద్దని కూడా అంటున్నారట.
సుషాంత్ మృతి తో బయటపడిన ఈ డ్రగ్స్ వ్యవహారం అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ని కుదిపేస్తుంది. అందులోను సౌత్ అండ్ నార్త్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ద కపూర్, దీపిక పదుకొణె, సారా అలీఖాన్.. ఇలా పేరుమోసిన సెలబ్రిటీసే ఉన్నారు. ప్రస్తుతం వీరు చేస్తున్న సినిమాల పరిస్థితేంటో అన్నది అందరిలో కలుగుతున్న అనుమానాలు. ఇప్పటికే మేకర్స్ నుంచి అడ్వాన్సులు కూడా తీసుకొని ఉండటంతో మేకర్స్ బాగా టెన్షన్ పడుతున్నారట.
అయితే ఎన్సీబీ అధికారుల ముందు ఇప్పటికే విచారణ నిమిత్తం ఈ సెలబ్రిటీస్ అందరూ హాజరయ్యారు. రకుల్ కొన్ని విషయాలను వెల్లడించింది. తను స్మోకింగ్ గాని తనకి అలాంటి హ్యాబిట్స్ ఏవీ లేవని తెలిపిందట. అంతేకాదు కేవలం డ్రగ్స్ నా దగ్గర దాచారు తప్ప వాటిని నేను ఏనాడు వాడలేదని క్లారిటీ ఇచ్చిందట. కాని ఇందులో దీపిక గురించి ఒక హాట్ న్యూస్ బాగా వైరల్ అవుతోంది.
తను డ్రగ్స్ కావాలంటే కోడ్ లాంగ్వేజ్ వాడిందన్న విషయం విచారణలో బయటపడిందని వార్తలు వస్తున్నాయి. దీపికా తన మేనేజరు కరిష్మా ప్రకాష్ మరియు టాలెంట్ మేనేజర్ జయ సాహాలతో వాట్సాప్ ఛాట్ లో ‘మాల్’ ‘హ్యాష్’ గురించి డిస్కస్ చేసినట్లు సమాచారం. ‘మాల్’ అంటే సిగరెట్స్ అని.. ‘హ్యాష్’ అంటే స్లిమ్ సిగరెట్స్ అని.. ‘వీడ్’ అంటే మందపాటి సిగరెట్స్ అని దీపికా సమాధానమిచ్చిందట. కాగా దీపిక చెప్పిన సమాధానాలు పొంతన లేకుండా ఉన్నట్టు ఎన్సీబీ అధికారులు వెల్లడించినట్టు తెలుస్తుంది. చూడాలి మరి ఈ వ్యవహారంలో ఇంకా ఎలాంటి విషయాలు బయటపడనున్నాయో..!