Ranbir Kapoor Alia Bhatt: తమ అయిదేళ్ల ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకున్నారు బాలివుడ్ జంట ఆలియా భట్, రణ్ బీర్ కపూర్. ఇరు కుటుంబాలు, కొద్ది మంది స్నేహితులు, సన్నిహితుల మధ్య నిన్న వీరి వివారం జరిగింది. అయితే వివాహ వేడుకకు వచ్చిన వారిలో అందరికంటే ఎక్కువగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ సందడి చేశారని టాక్. సంగీత్ లో ఆలియాతో రాధా పాటకు డ్యాన్స్ చేసి మరీ అందరిలో జోష్ నింపారుట. కరణ్ జోహర్ – ఆలియా భట్ మధ్య ఉన్న అనుబంధం చాలా ప్రముఖమైనది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మువీతో ఆలియాను హీరోయిన్ గా పరిచయం చేసింది కరణ్ జోహర్ అనేది అందరికీ తెలిసిందే. అప్పటి నుండి ఆలియాను కరణ్ ఒక కేర్ టేకర్ గా చూసుకుంటున్నారు.
Ranbir Kapoor Alia Bhatt: రణ్ బీర్ ను అల్లుడిగా సంభోదించిన కరణ్ జోహర్
కరణ్ – ఆలియాకు మద్య ఉన్న చనువు బావీవుడ్ సర్కిల్ లో అందరికీ తెలిసిందే. రణ బీర్ – ఆలియా వివాహం సందర్భంగా వీరి మధ్య ఉన్న అనుబంధం మరో సారి వెల్లడైంది. ఆలియా వివాహం తర్వాత కరణ్ జోహర్ మరింత ఏమోషనల్ అయ్యారు. ఆలియాపై తనకు ఉన్న ప్రేమను తెలియజేస్తూ తన ఇన్ స్టా అకౌంట్ లో ఓ పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా ఆలియాను వివాహం చేసుకున్న రణ్ వీర్ ను అల్లుడు అంటూ సంభోదించాడు కరణ్ జోహర్. ఆలియాను వివాహం చేసుకోవడం ద్వారా ఆమె తండ్రి మహేష్ భట్ కు రణ్ బీర్ అల్లుడు అవ్వగా, ఆలియాను బాలీవుడ్ లో కేర్ టేకర్ గా వ్యవహరించిన కరణ్ జోహర్ కూడా ఇప్పుడు మామ అయ్యారు. కరణ్ జోహర్ పెట్టిన పోస్ట్ కు సోషల్ మీడియాలో నెటిజన్ లు లైక్ ల మీద లైక్ లు చేస్తున్నారు.