Top Heroine Marriage : చాలా మంది హీరోయిన్లు తమ హవా నడుస్తున్న సమయంలో వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసేస్తారు. ఆ తర్వాత వయసు మీద పడుతున్న తరుణంలో పెళ్లి చేసుకుని స్థిరపడుతున్నారు. పెళ్లి తర్వాత కొందరు ఇండస్ట్రీకి దూరమవుతుండగా, మరి కొందరు తల్లి, సోదరి వంటి పాత్రలతో అలరిస్తున్నారు. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారుతోంది. కెరీర్ పీక్ దశలో ఉండగానే హీరోయిన్లు పెళ్లి చేసుకుంటున్నారు. ఆ తరువాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇదే కోవలో ప్రముఖ హీరోయిన్ తాప్సీ పన్ను కూడా నడవనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆమె పెళ్లి పీటలెక్కనుందని, ఆమె ప్రియుడితో వివాహానికి కుటుంబం కూడా సమ్మతి తెలిపిందని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Top Heroine Marriage: బాలీవుడ్లో పాగా
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మంది నాదం చిత్రం ద్వారా ఆమె సినీ రంగ ప్రయాణం ప్రారంభించింది. ఈ క్రమంలో తెలుగులో అగ్రహీరోల సరసన నటించింది. తెలుగులో అవకాశాలు సన్నగిల్లుతున్న సందర్భంలో బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ, టాప్ హీరోయిన్గా నిలదొక్కుకుంది. హసీనా దిల్ రూబా, తప్పడ్, పింక్, ముల్క్, బదలా వంటి ఎన్నో విభిన్న, వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకతను నిలుపుకుంది. ఓ వైపు సినిమాలు చేస్తుండగానే మరో వైపు ప్రముఖ విదేశీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్‌తో పెళ్లికి సిద్ధమవుతోందని సమాచారం.
కుటుంబం నుంచి గ్రీన్ సిగ్నల్
ఐపీఎల్, ప్రొ కబడ్డీ మాదిరిగానే కొంత కాలం క్రిందట బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్‌ను భారత దేశంలో నిర్వహించారు. వివిధ జట్ల నుంచి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు పోటీ పడ్డారు. ఆ తరుణంలో ఓ జట్టుకు ప్రచారకర్తగా వ్యవహరించింది తాప్సీ. ఈ క్రమంలో విదేశీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్‌తో పరిచయం ఏర్పడింది. అది కొంత కాలానికి వారి మధ్య ప్రేమగా మారింది. వీరి ప్రేమకు పెద్దలు కూడా అంగీకారం తెలిపారు. ఓ వైపు తీరిక లేకుండా సినిమాలు చేసే తాప్సీ, ఏ మాత్రం అవకాశం దొరికినా మథియాస్‌తో కలిసి విహార యాత్రలకు వెళ్లేదు. ఈ తరుణంలో త్వరలో వారి పెళ్లికి కుటుంబ పెద్దలు డేట్ కూడా నిశ్చయించారని, దీంతో వారిద్దరూ వివాహం ద్వారా ఒక్కటి కానున్నారని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?