Games: దాదాపు రెండు సంవత్సరాలుగా కరోనా వ్యాప్తి దృష్ట్యా అనేక మంది విద్యార్థులు చదువుల్లేక ఇంటికే పరిమితమయ్యారు. ఇక ఆన్లైన్ క్లాసుల పుణ్యమాని మొబైల్ ఫోన్లకు వీరు బాగా అలవాటు పడ్డారు. ఈ క్రమంలో మొబైల్ గేమ్ కంపెనీలు కూడా బాగా అభివృద్ధి సాధించాయి. యువతనే టార్గెట్ గా సదరు కంపెనీలు పలు మొబైల్ గేములను రూపొందించాయి. ఇంకేముంది కట్ చేస్తే విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు బదులుగా మొబైల్ గేమ్స్ ఆటలలో మునిగి తేలుతున్నారు. ఇది ఆయా కంపెనీలకు బాగా కలిసొచ్చింది.
Ginger Oil: ఈ నూనె తో జలుబు నుంచి క్యాన్సర్ వరకు అన్నింటినీ నయం చేస్తుంది..!!
కోట్లలో డబ్బులు సంపాదిస్తున్న గేమ్స్ ఇవే…
అందులో ముందు వరుసలో వుంది ‘పబ్జీ’ మొబైల్ గేమ్. పబ్జీ మొబైల్ భారతదేశంలో బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరుతో లాంచ్ చేసిన విషయం స్టూడెంట్స్ కు బాగా తెలుసు. ఇది ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ ప్రియులకు ఇది ఫేవరెట్ గేమ్. ఈ గేమ్ ఈ సంవత్సరపు మోస్ట్ పాపులర్ గేమ్‌గా రికార్డులు సృష్టించింది. 2021లో పబ్జీ గేమ్ ఏకంగా 2.8 బిలియన్ డాలర్లను సంపాదించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తరువాత ఈ వరుసలోకి వచ్చి చేరుతుంది ‘హానర్ ఆఫ్ కింగ్స్.’ 2021లో అక్షరాలా 2.8 బిలియన్ల డాలర్లను ఈ గేమ్ సంపాదించింది.
Whatsapp: 2022లో రాబోతున్న వాట్సాప్ ఫీచర్లతో యూజర్లు పండగ చేసుకోండి!
మిగిలిన గేమ్స్ వివరాలివే…
వాటి తరువాత ‘జెన్షిన్ ఇంపాక్ట్’ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. 2020 సెప్టెంబర్ 28న లాంచ్ అయిన ఈ గేమ్ ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 2.4 బిలియన్ డాలర్లను గడిచింది. తరువాత గేమ్ పేరు ‘రోబ్లోక్స్’. ఈ గేమ్ 2021 ఏడాదిలో 1.3 బిలియన్ డాలర్లను సంపాదించింది. అలాగే ‘పోకీమన్ గో’ గురించి వినే వుంటారు. ఇది 2021లో 1.2 బిలియన్ డాలర్లు సంపాదించింది. ఇక ‘కాండీ క్రష్ సాగా’ గేమ్ 2021లో 1.2 బిలియన్ డాలర్లు, ‘గారెనా ఫ్రీ ఫైర్’ 1.1 బిలియన్ డాలర్లను ఆర్జించింది.