Tech news: జగమంతా ఆన్లైన్ మయం. ఇపుడు ఏది కావలసినా అందరూ ఆన్లైన్లోనే వెతికేస్తున్నారు. అందుకే తాజాగా 2021లో ఎక్కువ మంది ఏ వెబ్సైట్లు చూసారు? అనే విషయంపైన సర్వే జరిగింది. ఈ జాబితాలో గూగుల్ అగ్రస్థానంలో ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా సర్వే ఫలితాలు వెలుగు చూశాయి. ఈ సంవత్సరం మోస్ట్ విజిటెడ్ వెబ్‌సైట్‌గా షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్ అయినటువంటి టిక్‌టాక్ టాప్‌లో నిలువడం అందరినీ ఆశ్యర్యపరిచింది. డేటా విషయంలో ఇది పలు విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసినదే. మనదేశంలో ఏకంగా దాన్ని బ్యాన్ చేసారు. అయినా అది టాప్ లో నిలవడం చాలా గ్రేట్.
ఎక్కువగా జనాదరణ పొందిన మిగిలిన టాప్ వెబ్సైట్లు:
ఇక ప్రపంచంలో ఎక్కువ మంది చూసిన రెండో వెబ్‌సైట్‌గా గూగుల్ నిలిచింది. ఇది మొదటి స్థానంలో లేకపోవడం నిజంగా గూగుల్ కి షాకే. అలాగే సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ అయినటువంటి ఫేస్బుక్ మూడో స్థానంలో నిలిచి, శెభాష్ అనిపించుకుంది. దాని తరువాత వన్‌డ్రైవ్, ఎక్స్‌బాక్స్ లాంటి సేవలను నడుపుతున్న మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ నాలుగో స్థానంలో ఉండటం కొసమెరుపు. యాప్ స్టోర్ లాంటి సర్వీసులను ఎక్కువ మంది వినియోగిస్తుండడంతో యాపిల్ టాప్-5లో స్థానంతో వెలుగొందింది.
జనాదరణ పొందిన మిగిలిన 5 వెబ్సైట్లు ఇవే..
ప్రముఖ ఈకామర్స్ ఫ్లాట్‌ఫామ్ అయినటువంటి అమెజాన్ 2021లో మోస్ట్ విజిటెడ్ జాబితాలో ఆరో ప్లేస్ దక్కించుకోవడం విశేషం. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన నెట్‌ఫ్లిక్స్ ఈ లిస్ట్‌లో ఏడో స్థానంలో నిలిచి తన ఉనికిని చాటుకుంది. అయితే ప్రపంచ అతిపెద్ద OTT అనిపించుకున్న యూట్యూబ్.. 8వ ప్లేస్ సరిపెట్టుకుంది. ఇది ఎవ్వరూ ఊహించలేదు. దీని తరువాత మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ అయినటువంటి ట్విట్టర్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇక చివరగా పాపులర్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ అయినటువంటి వాట్సాప్‌కు చెందిన వెబ్ వెర్షన్ టాప్-10లో రెపరెపలాడింది. ఇందులో మీరు ఎక్కువగా ఏది చూసారో మరి!