Brahmanandham: మన తెలుగు సినీ పరిశ్రమలో బ్రహ్మానందం Brahmanandham ఒక మోస్ట్ వాంటెడ్ కమెడియన్. అసలు బ్రహ్మానందం పేరు వింటే చాలు, చాలామందికి పెదవుల పైకి చిరునవ్వు వస్తుంది. వెండితెర మీద బ్రహ్మానందం కనిపిస్తే చాలు ప్రేక్షకులు ఎంతగానో సంబరపడిపోతుంటారు. అయితే ఈయన హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నప్పటి నుంచి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత సంవత్సరం సంక్రాంతికి విదుదల అయిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలోనే కాసేపు అలా కనిపించారు. ఈ మధ్య ఆయన ఆరోగ్యం సరిగా లేనందున ఆయన సినిమాలు చెయ్యడం.
టాలీవుడ్ లో ప్రస్తుతం బ్రహ్మానందం ఒక మోస్ట్ వాంటెడ్ కమెడియన్‌గా ఉన్నారు. ఎంతమంది కొత్త కమెడియన్స్ టాలీవుడ్ కి పరిచయం అవుతున్నప్పటికీ బ్రహ్మి క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గడంలేదు. ప్రస్తుతం బ్రహ్మానందం ఒక్కో కాల్ షీట్ కు ఏకంగా రూ. లక్ష చార్జ్ చేస్తున్నారట. సినిమాలో ఆయన పాత్రను బట్టి ఒక్కో సారి ఒకే సినిమాకు ఏకంగా రూ. కోటి వరకు పారితోషకం తీసుకుంటూ ఉంటారట.
ఇప్పటికే బ్రహ్మానందం దాదాపుగా 1000 చిత్రాల్లో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదయ్యారు. బ్రహ్మానందం కి ఎంతటి సన్నిహితులైనప్పటికీ ఆయన ఎప్పుడూ ఒక్క పైసా కూడా తీసుకోకుండా సినిమాలలో నటించిన దాఖలాలు లేవట. ఈయన ఈ మొత్తాన్ని కొన్ని రియల్ ఎస్టేట్స్ మరియు వివిధ వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేశారట. ఇప్పటి వరకు బ్రహ్మానందం స్థిర, చరాస్థులు మొత్తంగా అన్ని కలిపితే సుమారు రూ. 400 నుంచి రూ. 450 కోట్ల వరకు ఉంటుందని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది. అంతేకాదు బ్రహ్మానందం డబ్బు విషయంలో మాత్రం చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తారట. అంతేకాకుండా ఈయనకి ఏ దురలవాట్లు లేనందున ఇన్ని వందల కోట్ల ఆస్తులు కూడబెట్టగలిగారని అంటున్నారు.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.