ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు మెగా మేనల్లుడి మీదే ఆధారపడి.. అది మెగా పవర్ అంటే ..!

కోవిడ్ 19 కారణంగా అన్నీ చిత్ర పరిశ్రమలు అగాధంలోకి వెళ్ళిన సంగతి తెలిసిందే. దాదాపు 8 నెలలపాటు సినిమాలు ఏవీ థియోటర్స్ లో రిలీజ్ కాకపోవడం తో ఇప్పటికే కొన్ని థియోటర్స్ గోడాన్స్ గా మారిపోయాయి కూడా. కాగా రీసెంట్ గా మళ్ళీ సినిమా థియేటర్స్ రీ ఓపెన్ కి అనుమతులు వచ్చినప్పటికీ.. థియోటర్స్ రెడీ అవుతున్నప్పటికి.. థియేట్రికల్ రిలీజ్ కి మేకర్స్ ధైర్యం చేయడం లేదు. అదీ కాక 50శాతం సీటింగ్ ఆక్యుపెన్సీతో థియేటర్ తెరవాలనే కండీషన్ ఉండటంతో సినిమాకి రావాల్సిన వసూళ్ళు వస్తాయా అన్న అనుమానాలతో నిర్మాతలు డైలమాలో ఉన్నారట.

Sai Dharam Tej's 'Solo Brathuke So Better' likely to release in theatres  soon | The News Minute

ఇలాంటి పరిస్థితుల్లో మెగా మేనల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’ థియేటర్లలో విడుదల చేయడానికి డేర్ చేశాడు. వేసవిలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఓటీటీ నుంచి మంచి ఫ్యాన్సీ ఆఫర్ వచ్చినప్పటికీ ఒప్పుకోలేదు. ఇక ఈ సినిమా రైట్స్ సొంతం చేసుకున్న జీ స్టూడియోస్ వారు డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

జీ స్టూడియోస్ వారు సాయితేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాని దాదాపు 30-35 కోట్లకి తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పుడున్న సగం థియేటర్స్ సగం ఆకుపెన్సీ వంటి షరతులతో సినిమాకి పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టుకోవాలంటే సంక్రాంతి సీజన్ వరకూ ఈ సినిమా కి మరో సినిమా పోటీ కి రాకుండా ఉండాలి. ఈ విషయం లో టాలీవుడ్ మేకర్స్ ధైర్యంగా ముందుకొచ్చి సినిమాను థియేటర్ లో విడుదల చేస్తున్న మెగా మేనల్లుడి సినిమాకి సపోర్ట్ చేయాలని అంటున్నారు.

మేకర్స్ ఈ సినిమా హిట్ మీద చాలా నమ్మకంగా ఉన్నారు. కాబట్టి పాజిటివ్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకులు థియటర్స్ కి రాగలిగితే ఆ తర్వాత మిగతా సినిమాలన్నీ థియేట్రికల్ రిలీజ్ చేయడానికి ముందుకు వస్తారు. అందుకే ‘సోలో బ్రతుకే..’ సినిమా లాంగ్ రన్ కి ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఇవ్వాలని అంటున్నారు. ఇక ఈ సినిమాకి సుబ్బు దర్శకత్వం వహించగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. ‘చిత్రలహరి’ ‘ప్రతిరోజు పండగే’ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న సాయి తేజ్ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టబోతున్నాడని మెగా ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.