NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Tirupati by poll : తిరుపతి ఓటరు ఎటు..? టఫ్ ఫైట్ తప్పేట్టు లేదు..!!

tough fight in tirupati by poll

tirupati by poll : తిరుపతి ఉప ఎన్నిక Tirupati by poll తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. పార్టీలన్నీ తమ బలాబలాలు చూపించాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లు చేశాయి. హామీలు ఇచ్చాయి. ప్రభుత్వ వైఫల్యాలను చూపించి ప్రధాన ప్రతిపక్షం, ఇతర పార్టీలు ప్రజల్లోకి వెళ్లాయి. తాము చేస్తున్న సంక్షేమం, గత ప్రభుత్వ తప్పిదాలు.. పార్టీల తీరును అధికార పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లింది. ప్రచారం ముగిసింది.

రేపు ఎన్నిక జరగబోతోంది. ఈ ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ ను నిలబెట్టుకోవాలని వైసీపీ.. గెలిచి సత్తా చాటాలని టీడీపీ, ఉనికి చాటుకోవాలని బీజేపీ-జనసేన పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే.. ఉప పోరు రసవత్తరంగా మారిపోయింది. కారణం.. మొన్నటి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలే.

tough fight in tirupati by poll
tough fight in tirupati by poll

సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ బలపరచిన అభ్యర్ధులు ఎక్కువగా గెలుపొంది పంచాయతీలపై పట్టు సాధించారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని భావించిన టీడీపీ కొన్ని పంచాయతీలను గెలుచుకుంది. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరుగుతాయి కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుందని భావించింది. కానీ.. అందరి అంచనాలను తారుమారు చేస్తూ వైసీపీ తిరుగులేని విజయం సాధించింది.

పంచాయతీల్లో తాము బలపరచిన అభ్యర్ధులను గెలిపించి సత్తా చాటుకుంది జనసేన. మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రి మినహా వైసీపీ ఎవరికీ అవకాశమే ఇవ్వలేదు. ఈ ఫలితాల నేపథ్యంలో ఇప్పట్లో వైసీపీకి ఎదురుతిరిగే ధైర్యం విపక్షాల్లో లేకపోయింది. అయితే.. వీరికి అందివచ్చిన అవకాశంలా తిరుపతి ఉప ఎన్నిక వచ్చింది.

ఉప ఎన్నికలో గెలుపు నల్లేరుపై నడకే అని భావించిన వైసీపీకి పరిస్థితులు జటిలంగా మార్చేశాయి. పవన్ రోడ్ షో.. సంచలనం రేపాయి. టీడీపీ కూడా ప్రచారంతో హోరెత్తించింది. చంద్రబాబు, లోకేశ్ తమదైన శైలిలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రచారం చేశారు. దీంతో వైసీపీ అలెర్టయింది. స్వయంగా సీఎం వైఎస్ జగన్ తిరుపతి ప్రచారానికి వస్తానని ప్రకటించినా.. మళ్లీ రద్దు చేసుకున్నారు.

ఇప్పుడు అక్కడ దాదాపు సగం ప్రభుత్వమే అక్కడ ఉండి వైసీపీ గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఇలా మొత్తంగా తిరుపతి ఉప ఎన్నిక రసవత్తరంగా మారిపోయి.. ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ పిరిస్థితులకు వేదికైంది. మరి.. తిరుపతి ఓటర్లు ఏం తీర్పు ఇస్తారో చూడాలి.

author avatar
Muraliak

Related posts

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju