18.7 C
Hyderabad
January 29, 2023
NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసుల తీరుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందన ఇది

Share

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమెను నిన్న సీబీఐ 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఈ నెల 6వ తేదీ 11 గంటలకు హైదరాబాద్ నివాసంలో గానీ లేక ఢిల్లీలోని నివాసం వద్ద గానీ విచారణ చేస్తామని తెలిపారు. ఈ విధంగా వెసులుబాటు కల్పిస్తూ సీబీఐ నోటీసులు ఇవ్వడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్సీ కవిత కు సీబీఐ నోటీసులపైనే తమకు అనుమానాలు ఉన్నాయన్నారు.

Revanth Reddy

 

అందరినీ ఢిల్లీకి పిలిపించి విచారణ చేస్తున్నప్పుడు కవితకు మాత్రం మినహాయింపు ఎందుకు, కవితను ఇంట్లోనే విచారణ చేస్తామని అనడంలో అంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. అసలు విషయం ఏమిటో ఇక్కడే తెలుస్తొందన్నారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ లు బెంగాల్ ఫార్ములా ను అమలు చేస్తున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరు ఓ వీది నాటకంగా ఆయన అభివర్ణించారు. కుమ్మక్కు రాజకీయాలు అంటే ఇవేనని వీటిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.

సీబీఐ అధికారికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత..ఢిల్లీ లిక్కర్ స్కామ్ నోటీసులపై తాజా ట్విస్ట్


Share

Related posts

హీరో మోత మోగించింది..!! మరో అరుదైన రికార్డ్..!!

bharani jella

ఆర్‌టిసి చార్జీల పెంపుపై టిడిపి నేతల ఫైర్

somaraju sharma

నాడు వారు… నేడు వీరు….!

somaraju sharma