Categories: న్యూస్

Revanth Reddy: ఎర్రవల్లిలో రచ్చబండకు బ్రేక్.. ? టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్టు..

Share

Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రబల్లిలో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రచ్చబండ నిర్వహిస్తామని తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. వరి వేస్తే ఉరే అన్న కేసిఆర్.. ఆయన వ్యవసాయ క్షేత్రంలోని 150 ఎకరాల్లో యాసంగి వరి పండిస్తున్నారని నిన్న రేవంత్ వ్యాఖ్యానించారు. ఈ పంటను మీడియాకు చూపుతానని పేర్కొన్నారు.

TPCC chief Revanth Reddy House arrest

 

Revanth Reddy:  రేవంత్ ఇంటి చుట్టూ పోలీసు బలగాల మోహరింపు

ఈ నేపథ్యంలో సోమవారం ఆయనను రచ్చబండకు వెళ్లనివ్వకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఆయన ఇంటి వద్దకు చేరుకుని గృహ నిర్బంధం చేశారు. ఇంటి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీని పై రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదిక ద్వారా స్పందించారు. తెలంగాణ పోలీసులకు స్వాగతం, నా ఇంటికి వచ్చే అన్ని దారులను పోలీసులు చుట్టుముట్టారు. ప్రభుత్వం దేనికి భయపడుతోంది. ఎందుకు భయపడుతోంది. అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా తన ఇంటి సమీపంలో అన్ని దారుల్లో పోలీసులు మోహరించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు రేవంత్ రెడ్డి.

ఎర్రవల్లి రచ్చబండకు పోలీస్ అనుమతి లేదు

ఎర్రవల్లిలో మీటింగ్ పెట్టడానికి రేవంత్  రెడ్డికి అనుమతి లేదని పోలీసులు పేర్కొంటున్నారు. అయితే ఎలాగైనా రచ్చబండ నిర్వహించి తీరుతామని కాంగ్రెస్ శ్రేణులు పట్టుబడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ నేతలను ఎక్కడి కక్కడ అరెస్టులు చేస్తున్నారు. చాలా మంది కాంగ్రెస్ నేతల ఇళ్ల ముందు సోమవారం ఉదయం నుండే పహారా కాస్తూ వారందరినీ హౌస్ అరెస్టు చేశారు.


Share

Recent Posts

రాజకీయ రంగంలోకి సౌత్ ఇండియాలో మరో టాప్ హీరోయిన్..??

దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…

8 నిమిషాలు ago

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

1 గంట ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

2 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

3 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

4 గంటలు ago