NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

కేసిఆర్ బీఆర్ఎస్ ఈసీ గుర్తింపునకు మోకాలడ్డుతున్న రేవంత్ రెడ్డి.. ఫలించేనా..?

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ను జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) గా మారుస్తున్నట్లు రీసెంట్ గా ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆమోదించిన తీర్మానాన్ని, పార్టీ మార్పునకు సంబంధించి ఆయన లేఖను కేసిఆర్ తమ పార్టీ ప్రతినిధుల ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. ఇప్పటికే కొద్దిగా పేరు మార్పుతో బీఆర్ఎస్ పేరుతో రెండు మూడు ధరఖాస్తులు ఈసీ వద్ద పెండింగ్ లో ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. అయితే టీఆర్ఎస్ కు సంబంధించి పార్టీ పేరు మార్పు అంశంపై ఇంత వరకూ ఈసీ నుండి ఆమోదం రాలేదు. ఈ తరుణంలోనే బీఆర్ఎస్ గుర్తింపును అడ్డుకునేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మోకాలడ్డే ప్రయత్నం చేస్తున్నారు.

Revanth Reddy

 

టీఆర్ఎస్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుతం బీఆర్ఎస్ గా గుర్తించకుండా నిలువరించాలని కోరుతూ రేవంత్ రెడ్డి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయను న్నట్లు తెలుస్తొంది. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తాను దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పు వచ్చే వరకూ సదరు పార్టీ పేరు మార్చకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారుట. ఎందుకంటే .. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేతలు పార్టీ కోసం విరాళాలు వసూలు చేశారని ఆరోపిస్తూ గతంలో రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నిధుల వసూళ్లలో పాల్గొంటే వారు నేరానికి పాల్పడినట్లే అవుతుందనీ, ఇది లంచం తీసుకోవడంతో సమానం అని రేవంత్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు.

KCRs BRS

 

‘గులాబీ కూలీ’ పేరుతో టీఆర్ఎస్ నేతలు వందలాది కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. ఈ అంశాన్ని పరిశీలించాలని ఢిల్లీ హైకోర్టు గతంలో ఈసీని కోరినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 2018 నుండి తాను దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉందనీ, ఆ కేసులో కోర్టు తీర్పు ఇస్తే టీఆర్ఎస్ తన గుర్తింపును కోల్పోతుందని అంటున్నారు.రేవంత్ రెడ్డి దాఖలు చేయబోయే పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది..? మద్యంతర ఉత్తర్వులు ఏమైనా ఇస్తుందా..? లేక ఈసీనే స్పందిస్తుందా..?. రేవంత్ రెడ్డి ప్రయత్నాలు సఫలం అవుతావా..? కావా అనేది ఆసక్తికరంగా మారింది.

హిందూపురం వైసీపీ నేత దారుణ హత్య .. ఎమ్మెల్సీపై ఆరోపణలు ..స్థానిక పోలీస్ అధికారులపై వేటు

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju