మన ఈ బిజీ జీవితం లో పెద్దలు చెప్పిన చాల విషయాలు మరిచిపోతున్నాం లేదా పట్టించుకోకుండా వదిలేస్తున్నాం నిజానికి బిజీ కి అవి పట్టించుకోవడానికి సంబంధం లేకపోయినా వారు చెప్పిన మంచి విషయాలు పక్కన పడేస్తున్నాం. అలాంటి కొన్ని విషయాలగురించి తెలుసుకుందాం.
ఇంటిలో ఉండే మగవారు ఆదివారము, మంగళ వారము,శుక్రవారం నాడుజుట్టు కత్తిరించుకోవడం, గడ్డము చేసుకోవడం వంటి పనులు చేయకూడదు. అలా చేయడం వలన దరిద్రం పడుతుంది. ఎప్పుడు ఏ మంచి పనులను మొదలు పెట్టాలన్న, శుక్ల పక్షము లో అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయ వలెను.
చాలామంది కి దిండు మీద కూర్చునే అలవాటు ఉంటుంది.అది అసలు ఉండకూడని అలవాటు. కాబట్టి మీరు కూర్చోవద్దు,మీ పిల్లలనుకూడా దిండు పైన కూర్చోనీయవద్దు.
చాల మంది ఆడవారికి రాత్రి సమయమున పడుకునేప్పుడు,గాజులు చెవులకు పెట్టుకున్న ఆభరణాలు తీసే అలవాటు ఉంటుంది. కానీ అలా అసలు చేయకూడదు .
కొత్త బట్టలు కట్టుకునే ముందు దానికి కొంత పసుపు ఏదైనా ఒక మూల రాయాలి. పసుపు క్రిమినాశిని కాబట్టి తప్పకుండా పాటించాలి.
ఒకరు పెట్టుకున్న పువ్వులు ఎట్టి పరిస్థితులలో మరొకరు పెట్టుకోకూడదు.
నలుపు రంగు అశుభాన్ని సూచిస్తుంది కాబట్టి నలుపు రంగు వస్తువులు బట్టలు ధరించ కూడదు. ఈ మధ్య కాలంలో సువాసిని స్త్రీలు కూడా నలుపు రంగు వస్తువులు ధరించడం కనిపిస్తుంది. అది అంత శుభ ప్రదం కాదు.
ఉప్పు, మిరపకాయలు, చింతపండు వీటిని ఎవరికి చేతికి ఇవ్వకూడదు. కింద పెట్టి వారినే తీసుకోమనాలి. ప్రతి రోజు టిఫిన్ చేసే ముందు, భోజనమునకు ముందు కాకి కి అన్నము పెట్టండి, ఇది పితృ దేవతలకు ప్రీతి కలుగుతుంది. కాకికి మనము భోజనము చేయడానికి ముందు గానే పెట్టాలి.
ఎవరికైనా కొబ్బరి చిప్ప తాంబూలం ఇచ్చేటప్పుడు మూడు కండ్లు వుండే భాగము మనం ఉంచుకుని మిగత భాగము ఇతరులకు ఇవ్వవలెను. ప్రతి దానికి ఎందుకు ఏమిటి అనేది తెలియకపోవచ్చు.. కానీ అర్ధం లేకుండా మాత్రం ఉండదు. ఎదో ఒకరోజు మీకు తెలిసే రోజు వస్తుంది. అప్పుడు ఖచ్చితం గా తెలుస్తుంది. ఎందుకు చేయాలో తెలియదు కదా అని మంచి అనుకున్న పనులు చేయకుండా మానకండి!!