కర్నూలు ఎయిర్ పోర్టులో ట్రైల్ రన్

కర్నూలు, డిసెంబర్ 31: కర్నూలులో సుమారు  100 కోట్ల రూపాయలతో చేపట్టిన ఎయిర్ పోర్టు నిర్మాణం దాదాపు పూర్తి అయ్యింది. ఈ ఎయిర్ పోర్టును జనవరి ఏడవ తారీకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. సోమవారం ట్రైల్ రన్ నిర్వహించారు.

హైదరాబాదు బేగంపేట ఎయిర్ పోర్టు నుండి సీజె 2 విమాన సర్వీసు ట్రైల్ రన్‌లో భాగంగా సోమవారం ఇక్కడ ల్యాండ్ అయ్యింది. 90శాతం పనులు పూర్తి అయ్యాయని టర్న్  ఏవియేషన్ సంస్థ ప్రతినిధి శ్రీరాం తెలిపారు. విమాన సర్వీసు ట్రైల్ రన్ చూసేందుకు ఎయిర్ పోర్టు దగ్గర భారీ సంఖ్యలో జనాలు గుమిగూడారు