NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

‘కిడ్నాపర్ ప్లాన్’ను ప్లాప్ చేసిన పోలీసులు.. అసలేం జరిగిందంటే?

కిడ్నాపర్ల వీరంగం రోజురోజుకూ మితిమీరిపోతోంది. డబ్బులకు కక్కుర్తి పడి సొంత కుటుంబంలోని వారినే కిడ్నాప్ చేయడానికి వెనుకాడటం లేదు. మరీ ముఖ్యంగా ఏమీ తెలియని చిన్నారుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. దీనిలో చాలా మంది చిన్నారులు కిడ్నాపర్ల బారిన పడి ప్రాణాలను కోల్పోయారు. మరి కొంత మంది రక్షించబడ్డారు. ఎంతో గారాబంగా పెంచుకున్న పిల్లల్ని ఇలా కిడ్నాపర్లు ప్రాణాలు తీసేస్తుంటే ఆ తల్లి దండ్రుల బాధ వర్ణనాతీతం. మనం చూస్తూనే ఉన్నాం.. టీవీల్లోనూ, పేపర్లోనూ.. బాలుడు కిడ్నాప్ లేక బాలిక కిడ్నాప్… ఇంత డబ్బు చెల్లిస్తే విడిచిపెడతానన్న కిడ్నాపర్ అని..

రీసెంట్ గా తెలంగాణలోని మహబూబాబాద్ పట్టణంలో లో ఇలాంటి ఘటనే అందరినీ కంటతడి పెట్టించింది. డబ్బులకోసం ఓ బాలుడిని కిడ్నాప్ చేశాడో దుండగుడు. కాని కిడ్నాప్ చేసిన గంటన్నర లోపే బాలుడిని అతి దారుణంగా గొంతునులిమి చంపేశాడు. ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్ లో కూడా కిడ్నాప్ కు ఒడిగాట్టాడు ఓ వ్యక్తి. కాని సమయస్ఫూర్తితో వ్యవహరించిన పోలీసులు అందరి చేత శభాశ్ అనిపించుకున్నారు.

మూడేళ్ల బాలికను ఓ వ్యక్తి అపహరించి లలిత్ పూర్ రైల్వే స్టషన్ లో భోపాల్ వెళ్లే ఓ ట్రైన్ ఎక్కాడు. దాన్ని గమనించిన బాలిక తల్లిదండ్రుు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దానితో పోలీసులు లలిత్ పూర్ స్టేషన్ లోని రైల్వే పోలీసులు వెంటనే సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి కిడ్నాపర్ ఆ బాలికను తీసుకుని రప్తిసాగర్ ఎక్స్ ప్రెస్ ఎక్కినట్లుగా గుర్తించారు. దాంతో రైల్వే పోలీస్ ఇన్స్ పెక్టర్ వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి లోకో పైలెట్ తో మాట్లడి ఆ ట్రెయిన్ భోపాల్ వరకు ఎక్కడా ఆగకుండా తీసుకెళ్లాలని సూచించారు. దాంతో ఉత్తర ప్రదేశ్ లోని లలిత్ పూర్ స్టేషన్ నుంచి బయలు దేరిన ఆ ట్రెయిన్ మధ్యలో ఎక్కడా ఆగకుండా సుమారు 243 కి.మీ. దూరం ప్రయాణించి భోపాల్ స్టేషన్ లో ఆగింది.

అప్పటికే లలిత్ పూర్ రైల్వే పోలీసుల అప్రమత్తం వల్ల భోపాల్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇంకేముంది భోపాల్ పోలీసులు ఆ కిడ్నాపర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ బాలికను క్షేమంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసుల సమయ స్ఫూర్తితోనే ఆ బాలిక తిరిగి వారి తల్లిదండ్రులను చేరుకుంది. ఇలాగే పోలీసులు కిడ్నాపర్ల పట్ల అప్రమత్తంగా ఉంటే చిన్నారులు తమ ప్రాణాలను కోల్పోకుండా ఉంటారు. తమ తల్లిదండ్రులకు పుత్ర శోకం లేకుండా చేసినవారవుతారు.

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju