Bigg Boss 5 Telugu: కన్నీళ్లు తెప్పించిన ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ లవ్ స్టోరీ..!!

Share

Bigg Boss 5 Telugu:  ఒక ఫంక్షన్‌లో రవిని చూశాను. చూడటానికి చిన్నపిల్లాడిలా, అందంగా ఉంటాడు. అతడిని అబ్బాయి అని పిలిచేదాన్ని. పరిచయం అయిన తరువాత ఒకర్నొకరు అర్థం చేసుకున్నాం.. నువ్వు అలా ఉండాలి, అందరితో కలవాలి.. అంటూ నాకు ధైర్యం చెప్పేవాడు. ఇద్దరం బాగా క్లోజ్ అయ్యాం.. దాదాపు ఆరేళ్లు రిలేషన్‌లో ఉన్నాం.. ఎక్కడికి వెళ్లినా ఇద్దరం కలిసే వెళ్లాం. కానీ నా మనసులోని మాటను మాత్రం అతడికి ఎప్పుడూ చెప్పలేదు.

ఆ తర్వాత చెల్లి పెళ్లి అయింది ఇంట్లో ఇబ్బందులు మొత్తం క్లియర్ అయ్యాయి. అమ్మానాన్నలను చూసుకోగలను అని నమ్మకం కలిగింది దీంతో జెండర్ మార్చుకోవటం జరిగింది తర్వాత వెంటనే రవి కి ప్రపోజ్ చేయడం.. జరిగింది నువ్వు బాగుంటావ్ నీతో రిలేషన్ లో ఉంటాను అంటూ రవి తనకి… అండగా నిలబడ్డాడు దీంతో జీవితంలో మంచి తోడు దొరికింది అని అనుకున్నాను. ఆ తర్వాత ఇంకా పూర్తిగా అమ్మాయి గా మారిపోయాను. ఆ తర్వాత ఒకానొక రోజు నాకు నువ్వే ప్రపంచం, పెళ్లి చేసుకుందామా? అని అడిగాను. అతడు సరేనన్నాడు. కానీ సడన్ గా  ఒకరోజు మాత్రం ఇంటికి వచ్చి నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, చేసుకుంటాను అని చెప్పాడు.

Bigg Boss 5 Telugu: Priyanka Singh Gets Emotional About Her First Love - Sakshi

నాతో పెళ్లికి ఓకే అన్నావు కదా అన్న విషయాన్ని గుర్తు చేస్తే నువ్వేమైనా అమ్మాయివా? నీకేమైనా పిల్లలు పుడతారా? ఏం మాట్లాడుతున్నావు? పెళ్లంటావేంటి? ఉన్ననాళ్లు ఉందాం. అంతేనని చిరాకు పడ్డాడు. నేను తట్టుకోలేకపోయాను. నాకూ అమ్మ కావాలని ఉంది, అందుకోసం చాలా ఆసుపత్రులు తిరిగి కొన్ని లక్షలు ఖర్చు పెట్టాను. ఇలా సడన్‌గా వదిలేస్తే ఎలా? అని అతడి కాళ్లు పట్టుకుని ఏడ్చాను. అతడు వెళ్లిపోతుంటే ఆయన బండి వెనకాల పరిగెత్తాను, కానీ తన దారి తనే చూసుకున్నాడు. ఏదేమైనా అతడు హ్యాపీగా ఉంటే చాలు. అతడి సంతోషమే నాకు కావాలి. ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ ఫోన్ చేయటం జరిగింది పది రోజుల నుండి నిద్ర లేదు తిండి తిప్పలు లేవు నువ్వే నా ప్రపంచం అని అతనితో చెప్పాను. కానీ చిన్ననాటి నుండి సమాజం తనని ఏ పదంతో  అయితే దూషించటం జరిగిందో  అదే పదం అతడు దాదాపు..తనతో మాట్లాడిన టైం లో 200 సార్లు వాడి.. నానా మాటలు అన్నాడు.

జీవితంలో అంత దారుణంగా ఎవరూ కూడా నన్ను పెట్టలేదు ప్రేమించిన వాడు ఆ విధంగా పెట్టడంతో కుమిలిపోయాను అయినా గాని.. అతడు నాకు పెళ్లి కుదిరింది ఇటువంటివి కుదరదు అని చెప్పటంతో నీ సంతోషమే నా సంతోషం అని ఇక జీవితంలో ఎప్పుడు… కలవను అని .. కానీ నీకు జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా ఈ పింకీ అండగా ఉంటుంది అంటూ తనకు చెప్పినట్లు ప్రియాంక సింగ్ తన లవ్ స్టోరీ… హౌస్ లో చెప్పి కంటెస్టెంట్ ల చేత కన్నీళ్లు తెప్పించింది. సాధారణంగా ప్రేమలో అమ్మాయిలు అబ్బాయిలు పడుతుంటారు. ఫెయిలైన లవ్ స్టోరీ లు రకరకాలుగా ఉంటాయి. కానీ ఫస్ట్ టైం ట్రాన్స్ జెండర్.. ఒక అబ్బాయి కోసం.. మరీ అంతగా.. తానే సర్వస్వం అనుకొని… తన శరీరంలో అనేక మార్పులు చేసుకోవటం మాత్రమే కాక పిల్లలు కోసం అన్ని లక్షలు.. ఇటువంటి రోజుల్లో ధారపోయడం.. విని బయట జనాలు కూడా ట్రాంజెండర్ ప్రియాంక సింగ్ ప్రేమ కథ విని ఆశ్చర్యపోతున్నారు. ఏదిఏమైనా బిగ్ బాస్ హౌస్ లో… అందరి లవ్ స్టోరీ లో కంటే.. ప్రియాంక సింగ్ లవ్ స్టోరీ.. చాలా ఇంట్రెస్ట్ గా ఉందని.. బిగ్ బాస్ ఆడియన్స్ తెలియజేస్తున్నారు.


Share

Related posts

బ్రేకింగ్: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ

Special Bureau

గాంధీని చంపిన గాడ్సే పై వర్మ సినిమా…! ఇది మామూలు రిస్క్ కాదు

arun kanna

ఆ విషయంలో జగన్ సాధిస్తారా..? లేకపోతే చంద్రబాబుని అనుసరిస్తారా..?

sekhar