(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
చెక్ ఇన్ లగేజి బరువు ఎక్కువ ఉంది కాబట్టి రుసుము చెల్లించాలన్నారు. ఆ రుసుము భారీగా ఉంటుంది కాబట్టి ఆ ప్రయాణీకురాలు ఎలారా బాబూ అంటూ ఆలోచించింది. ఒక ఐడియా తట్టింది. అంతే రుసుము చెల్లించకుండానే ఎంచక్కా ప్రయాణించింది.
ఫిలిప్పీన్స్కు చెందిన జెల్ రోడ్రిగ్స్ ఒకరోజు విమానం ఎక్కేందుకు ఎయిర్పోర్టుకు వచ్చింది. క్యాబిన్ లగేజి బరువు ఎక్కువ ఉంది కాబట్టి అదనపు బరువుకు ఫీజు చెల్లించాలని ఎయిర్లైన్స్ సిబ్బంది చెప్పారు. మన అమ్మడు చకచకా సూట్కేసు లోంచి కొన్ని బట్టలు తీసి ఒకదానిపై ఒకటి ధరించింది. అలా బరువు సరిపోయేంతవరకూ తొడుక్కుంది. తొమ్మిది కిలోల సూట్కేసు బరువు 6.5 కిలోలకు తగ్గిన తర్వాత లగేజి చెక్ ఇన్ చేసి విమానం ఎక్కింది.
అలా ధరించిన బట్టలతో రోడ్రిగ్స్ ఒక ఫొటో దిగి తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేసింది. దానికి విపరీతమైన స్పందన వచ్చింది. అంత స్పందన వస్తుందనుకోలేదనీ, అయితే అన్ని బట్టలు వేసుకున్న తర్వాత వేడికి విపరీతంగా ఉక్క పోసింది కాబట్టి మళ్లీ అలాంటి పని చేయబోననీ ఆమె అంటున్నది.
https://www.facebook.com/photo.php?fbid=2430537840357366&set=a.428321277245709&type=3