Categories: న్యూస్

Trending viral: అదరగొట్టిన 80 ఏళ్ల బామ్మ.. కుర్రాళ్లు ఆశ్చర్యపోయేలా నదిలో దూకి ఈత!

Share

Trending viral: వయసు పెరిగే కొద్దీ ఎవరైనా కృష్ణా రామా అంటూ ఆధ్యాత్మిక బాటలోకి వెళ్తుంటారు. మనవళ్లతోనో, మనవరాళ్లతోనే కబుర్లు చెబుతూ జీవితాన్ని ఆస్వాదిస్తుంటారు. అయితే 80 ఏళ్ల వయసులో ఓ బామ్మ మాత్రం అందరికీ షాకిచ్చింది. హరిద్వార్‌లోని హర్ కీ పౌరి వంతెనపై నుంచి గంగలోకి దూకిన బామ్మ ఈత కొడుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ వయసులో ఉధృతంగా ప్రవహించే గంగా నదిలో నిర్భయంగా దూకి, చక్కగా ఈత కొడుతూ తేలిగ్గా ఒడ్డున తేలడం నిజంగా అందరినీ ఆకర్షిస్తోంది.

 

Trending viral:  బామ్మకు గుర్తొచ్చిన పాత రోజులు

హర్ కీ పౌరీ బిల్డింగ్‌పై నుంచి అనే భయం లేకుండా గంగలో దూకే ఈ వృద్ధురాలి వయసు 80 ఏళ్లు పైనే ఉంటుంది. ఈ వయసులో నడవలేమని, కూర్చోలేమని వృద్ధులు ఇబ్బందులు పడుతుంటారు. మిగిలిన వారిలా ఆమె మాత్రం మూలన కూర్చోలేదు. వృద్ధులు ఏమీ చేయలేరనే ఊహల్ని ఆమె పటాపంచలు చేసింది. హర్యానాలోని జింద్‌లో నివసిస్తున్న ఆ వృద్ధ మహిళ హర్ కీ పౌరిలో స్నానం చేయాలని భావించింది. ఈలోగా కొందరు యువకులు ఎత్తైన వంతెనపై నుంచి గంగానదిలోకి దూకడం చూసింది. ఆ వృద్ధురాలు కూడా తన పాత రోజులను గుర్తుచేసుకుని ఉద్వేగానికి లోనైంది.

అంతెత్తు నుంచి నదిలో దూకి..

వెంటనే ఆమె కూడా వంతెనపైకి చేరుకుని నేరుగా గంగానదిలోకి దూకింది. ఈ అద్భుత విన్యాసాన్ని అక్కడికక్కడే ఉన్న కొందరు తమ మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. బామ్మ స్టంట్ వీడియోను చూసి, సోషల్ మీడియా యూజర్లు ఊపిరి బిగబట్టుకున్నారు. అంతలా ఆమె చేసిన ఫీట్ నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. అందరూ ఆమెకు ఏదైనా అయి ఉంటుందని అనుకున్నారు. వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఆమె ఎంచక్కా ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చేసింది.


Share

Recent Posts

పాపం.. అఖిల్‌ ఆ క‌ష్టం నుండి ఎప్పుడు బ‌య‌ట‌ప‌డ‌తాడో?

నాగార్జున వార‌సుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని.. కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస ఫ్లాపుల‌ను మూడ‌గ‌ట్టుకున్నాడు. ఈయ‌న నుండి వ‌చ్చిన `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలు…

17 mins ago

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

1 hour ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

1 hour ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

3 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago