రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు నేడు

ట్రిపుల్ తలాక్ బిల్లును ఎలాగైనా చట్టం చేయాలన్న పట్టుదలతో ఉన్న కేంద్రం ఆ బిల్లును నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. విపక్షాల అభ్యంతరాలు, నిరసనల మధ్య బిల్లు లోక్ సభ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. గతంలోనే ఒక సారి లోక్ సభ ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.

దీంతో కొన్ని సవరణతో మరోసారి లోక్ సభలో ఈ బిల్లును ప్రవేశ పెట్టిన కేంద్రం…విపక్షాల అభ్యంతరాలు, నిరసనలను లెక్క చేయకుండా ముందుకు వెళ్లింది. ఓటింగ్ లో లోక్ సభ బిల్లును ఆమోదించింది.ఆ తరువాత ట్రిపుల్ తలాక్ బిల్లును నేరు రాజ్యసభలో ప్రవేశ పెట్టనుంది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెడతారు. బిల్లుపై ఓటింగ్ జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా బీజేపీ, కాంగ్రెస్ లు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి.