“వర్షం” సినిమా తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన త్రిష మొదటి సినిమాతోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరితో నటించిన త్రిష వయసు ప్రస్తుతం మూడు పదులు దాటడంతో ఆమె పెళ్లి గురించి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. అంతకుముందే ఓ ప్రముఖ వ్యాపార వేత్తతో నిశ్చితార్థం జరిగిన తర్వాత ఇద్దరు పెళ్లిని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఆ తర్వాత త్రిష వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీ గా మారింది. ఈ క్రమంలో ఇక జీవితంలో త్రిష పెళ్లి చేసుకోవడం లేదు అనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తన పెళ్లిపై వస్తున్న రకరకాల వార్తలు గురించి త్రిష స్పందించడం జరిగింది. ‘తాను పెళ్లి చేసుకోనని ఎప్పుడూ చెప్పలేదని.. తప్పకుండా చేసుకుంటాను’ అని త్రిష స్పష్టం చేసింది.
నా కెరియర్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేని వ్యక్తి జీవితంలో వస్తే కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని తన అభిప్రాయాన్ని తెలిపింది. అలాంటి వాడు జీవితంలో రాకపోతే ఒంటరిగానే బతికేస్తా పెళ్లి చేసుకోకుండా ఉండే ధైర్యం కూడా తనకి ఉందని, ఆడవాళ్లు ఏదైనా సాధించ గలుగుతారు అని త్రిష చెప్పుకొచ్చింది. దీంతో త్రిష చేసిన కామెంట్లు విని కచ్చితంగా త్రిష జీవితంలో బ్రహ్మచారిగా మిగిలిపోవడం గ్యారెంటీ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.