Bheemla Nayak: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) దగ్గుబాటి రానా(Rana) కలిసి నటిస్తున్న చిత్రం “బీమ్లా నాయక్”(Bheemla Nayak) అని అందరికీ తెలుసు. మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన “అయ్యప్పనుమ్ కోషియం” సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా, రానాకు రిటైర్డ్ ఆర్మీ మ్యాన్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్లు మరియు పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదే రీతిలో రిలీజ్ అయిన ప్రోమో కూడా అభిమానులను ఎంతగానో అలరించడం తో సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెరిగిపోయాయి.
చాలావరకు సినిమా పవన్ కళ్యాణ్ ని.. హైలెట్ చేసే రీతిలో తీసినట్లు అర్థమవుతోంది. మలయాళంలో ఇద్దరు హీరోల పాత్రలకు మంచి వెయిట్ ఉండగా తెలుగులో మాత్రం.. పవన్ కళ్యాణ్ పాత్ర… హైలెట్ అయ్యేలా సినిమా స్టోరీ మార్చినట్లు టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే సినిమాకి టాలీవుడ్(Tollywood) టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram).. మాటలు డైలాగులు స్క్రీన్ ప్లే అందిస్తున్న సంగతి తెలిసిందే. చాలావరకు డైరెక్టర్ సాగర్ కే చంద్ర ప్రోద్బలం కంటే త్రివిక్రమ్ ఈ సినిమా కోసం ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో మొదటినుండి టాక్ నడుస్తుంది.
పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న త్రివిక్రమ్ లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. విషయంలోకి వెళితే సినిమా మొత్తం కంప్లీట్ అయింది అని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు. పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నట్లు కూడా అభిమానులకు త్రివిక్రమ్ తెలియజేశారు. దాదాపు సినిమా చివరి దశకు చేరుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఊర మాస్ తరహా లో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్.. ఈ సినిమాలో ఉండటంతో సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.