మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్ ని అందుకున్నారు. అల్లు అర్జున్ , త్రివిక్రం లకి ఈ సినిమా ఊహించని సక్సస్ ఇచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా సరిలేరి నీకెవ్వరు సినిమాతో పోటీపడి టాప్ ప్లేస్ లో నిలిచింది.
ఇక ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎంటి.ఆర్.ఆర్ తో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా ఎన్.టి.ఆర్ కెరీర్ లో 30 వ సినిమా కావడం విశేషం. అయినను పోయిరావలే హస్తినకు అన్న టైటిల్ ప్రచారంలో ఉండగా అంత పొడుగున్న పేరు కాకుండా కాస్త సింపుల్ గా ఉన్నది అయితే బావుంటుందన్న సలహాలు వచ్చాయి. ఇంకా అధికారకంగా టైటిల్ ని అనుకోలేదు. ఇక ఎన్.టి.ఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియోషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రాం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఎన్.టి.ఆర్ సినిమా తర్వాత త్రివిక్రం అందరూ రెండేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నెక్స్ట్ సినిమా ఉండబోతుందని అనుకున్నారు. ఒక భారీ హిట్ పడే కథ కూడా త్రివిక్రం సిద్దం చేసినట్టు వార్తలు వచ్చాయి. కాని ఈ కాంబినేషన్ లో సినిమా ఇప్పట్లో ఉండదనే తెలుస్తుంది.
ప్రస్తుతం వకీల్ సాబ్ లో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత క్రిష్ సినిమా చేస్తుండగా కరోనా కారణంగా కొంత టాకీ పార్ట్ కంప్లీట్ చేసి ఆపేశారు. తిరిగి ఈ సినిమాని 2021 లో ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు పవన్ కళ్యాణ్, క్రిష్. అలా నిర్ణయించుకోవడానికి ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుండటమే. దాంతో నెక్స్ట్ లైన్ లో ఉన్న హరీష్ శంకర్ ముందుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారక ప్రకటన రానుంది.
కాగా సర్కారు వారి పాట చేయబోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక పాన్ ఇండియన్ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కి సంబంధించిన అఫీషియల్ న్యూస్ కూడా వచ్చేసింది. కాకపోతే ఈ సినిమా మొదలవడానికి రెండేళ్ళు పడుతుందని సమాచారం. అందుకే మహేష్ బాబు ఈ గ్యాప్ లో రెండు సినిమాలు కంప్లీట్ చేయాలనుకుంటున్నారట.
దాంతో మహేష్ బాబు, త్రివిక్రం కాంబినేషన్ లో సినిమా ఉంటుందని మహేష్ బాబు ఫ్యాన్స్ భావించారు. అయితే ఈ విషయంలో క్లారిటీ రావడం లేదు. మరోవైపు త్రివిక్రం.. మెగాస్టార్ కోసం స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దాంతో అటు మెగా ఫ్యాన్స్.. ఇటు మహేష్ బాబు ఫ్యాన్స్ డైలమాలో పడ్డారు. మరి త్రివిక్రం తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో పక్కాగా క్లారిటీ ఎందుకు రావడం లేదో అని చర్చించుకుంటున్నారు.