ఆ లోపు కుర్రహీరో ని లైన్ లో పెట్టిన త్రివిక్రమ్..??

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ ఏడాది సంక్రాంతి పండుగకు “అలా వైకుంఠపురములో” సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి మర్చిపోలేని బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తీసిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. అంతేకాకుండా బన్నీతో త్రివిక్రమ్ హ్యాట్రిక్ విజయాన్ని సాధించినట్లు అయింది.

Will Trivikram team up with Ram? | TeluguBulletin.comఇక ఆ తర్వాత త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేస్తారు అనే విషయంపై ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్న తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నట్లు కన్ఫామ్ చేయటం జరిగింది. కాగా ఆ తర్వాత కరోనా వైరస్ రావడంతో ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న భారీ మల్టీస్టారర్ ప్రాజెక్టు మూవీ “RRR” షూటింగ్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడటం అందరికీ తెలిసిందే .

 

అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ “RRR” సినిమా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి చాలా టైం పట్టే అవకాశం ఉండటంతో ఈ లోపు త్రివిక్రమ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర హీరోతో సినిమా చేయటానికి స్క్రిప్ట్ రెడీ చేసినట్లు లేటెస్ట్ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. పూర్తి విషయంలోకి వెళితే ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తో త్రివిక్రమ్ సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఫిలిం నగర్ టాక్. ఇప్పటికే స్టోరీ కూడా వినిపించినట్లు అంతా ఓకే అయినట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.