మెగా హీరోతో త్రివిక్రమ్ సెన్సేషనల్ ప్రాజెక్ట్..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా రాణిస్తున్న త్రివిక్రమ్ మెగా కాంపౌండ్ హీరోలలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, బన్నీలతో మాత్రమే సినిమాలు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్ చెర్రీకి స్క్రిప్టు వినిపించినట్లు అంతా ఓకే అయినట్లు టాక్ వస్తుంది.

After RRR, Ram Charan film with Trivikram Srinivas? - tollywoodఅంతేకాకుండా ఓ పొలిటికల్ అండ్ రొమాంటిక్ తరహాలో ఈ సినిమా ఉండబోతోందని అనే వార్తలు సోషల్ మీడియాలో స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం రామ్ చరణ్ – రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్” తో పాటు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమా ఏంటి అన్న దాని విషయంలో ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.

 

జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తో చరణ్ సినిమా అనుకున్న గాని..అది ఇంకా టైం పట్టే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్. దీంతో ఆచార్య అదేవిధంగా రాజమౌళి సినిమా తర్వాత కొద్దిగా చరణ్ గ్యాప్ తీసుకుని.. త్రివిక్రమ్ తోనే సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా వీలైతే ఈ సినిమాని పవన్ కళ్యాణ్ నిర్మించే అవకాశం ఉన్నట్లు కూడా టాక్ వస్తోంది. మరి త్రివిక్రమ్ చరణ్ ప్రాజెక్ట్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.