టాలీవుడ్ ఇండస్ట్రీలో స్నేహితులుగా త్రివిక్రమ్, సునీల్ కి మంచి పేరు ఉంది. ఇద్దరూ ఇండస్ట్రీలో రాకముందు నుండి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ సభ్యులు కావటంతో .. ఇండస్ట్రీ లో అవకాశాలు కోసం ప్రారంభం సమయంలో ఒకే రూములో ఉంటూ మంచి స్నేహితులు అయినట్లు వాళ్ళిద్దరు అనేక ఇంటర్వ్యూలలో చెప్పటం జరిగింది.
అయితే కెరీర్ పరంగా తిరుగులేని విజయాలు ప్రారంభంలో చూశారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గా త్రివిక్రమ్ రాణి స్తుండగా కమెడియన్ గా మొదట రాణించిన సునీల్ తర్వాత హీరోగా అనేక ప్రయోగాలు చేసి ఫెయిల్ అయి మళ్లీ ఇప్పుడు కమెడియన్ గా రాణించాలని చూస్తున్నాడు. ఇటువంటి తరుణంలో తన స్నేహితుడు సునీల్ కెరియర్ కోసం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేసిన అరవింద సమేత వీర రాఘవ లో ఓ క్యారెక్టర్ రోల్ కేటాయించగా అది పెద్దగా క్లిక్ కాలేదు.
ఈ నేపథ్యంలో ఈసారి చాలా డిఫరెంట్ గా సునీల్ ని చూపించాలని.. ఎన్టీఆర్ తో చేయబోయే 30 ఓ సినిమాలో సునీల్ కి విలన్ క్యారెక్టర్ కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఖచ్చితంగా సునీల్ కెరియర్ కి ప్లస్ అయ్యా రీతిలో త్రివిక్రమ్ ప్లాన్ చేశాడని ఇండస్ట్రీ వర్గాల టాక్.