ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

టీఆర్పీ స్కామ్.. తెలుగు న్యూస్ చానెళ్ళు బాగోతం “న్యూస్ ఆర్బిట్” చేతిలో..!

Share

రాజకీయాల్లో కులాల గొడవలు, మోసాలు, అబద్దపు హామీలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. కానీ మీడియాలో అవేమీ ఉండవా..? మీడియా ఏమైనా స్వచ్చమా..? స్వచ్చమైన ఆణిముత్యమా..? కాదు.. రాజకీయం ఎలాగైతే కులాల కంపు, అవినీతి, మాఫియా కంపుతో ఉన్నదో మీడియా కూడా అంతే తయారైంది. సినీ రంగంలో కాస్టింగ్ కౌచ్ ఏ విదంగా అయితే ఉందో మీడియాలో ఆ దరిద్రం ఉంటుంది. చీకటి బాగోతాలు చాలా మీడియా సంస్థల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా సాధారణ ప్రజలకు నష్టం కలగనంత వరకూ వాళ్లు ఎన్నైనా చేసుకోవచ్చు. అయితే టీఆర్ పీ రేటింగ్ విషయంలో జరుగుతున్న కుంభకోణం ఏమిటి..టిఆర్ పీల రేటింగ్ ల విషయంలో జరుగుతున్న మోసం ఏమిటి..? ఈ మోసం వల్ల ప్రజలకు ఏమైనా నష్టమా..? అంటే నష్టం ఉండవచ్చు. లేకపోవచ్చు. కానీ కార్పోరేట్ లకు పెద్ద దెబ్బ. యాడ్స్ ఇచ్చే సంస్థలకు పెద్ద దెబ్బ. ప్రజలను కూడా ఒక మైండ్ లోకి తీసుకువెళుతున్నట్లే. అబద్దం చెప్పడం వల్ల. రాజకీయ పార్టీలు అబద్దపు హామీలు ఇచ్చి ఎలా అయితే అధికారంలోకి వస్తారో.. మీడియా సంస్థలు కూడా ఫేక్ వ్యూస్ సృష్టించుకుని మేము నెంబర్ 1, మేము నెంబర్ 1 అని చెప్పుకుంటున్నాయి. ఇందులో న్యూస్ ఛానల్స్ కూడా ఉన్నాయి.

TRP Rating Scam
 TRP Rating Scam

రేటింగ్ లు ఇలా..

ఇటీవల న్యూస్ ఛానల్స్ రేటింగ్ లను పరిశీలిస్తే.. ఎన్ టీ వీ 80 పాయింట్ లతో టాప్ లో ఉంది. తరువాత 59 పాయింట్ లతో టీవీ 9 ఉంది. వీ 6 రేటింగ్ 33 పాయింట్ లు. 22 టీవీ 5, సాక్షి 17, ఎబీఎన్ 16, టీ న్యూస్ 15, టెన్ టీవీ 13, ఈటీవీ ఆంద్రప్రదేశ్ 12, ఈటీవీ తెలంగాణ 8, హెచ్ ఎం టీ వీ 5, ఐ న్యూస్ 2, రాజ్ న్యూస్ 1 పాయింట్ రేటింగ్ తో ఉన్నాయి. ఇంతకు ముందు టీవీ 9 నెంబర్ 1 పొజిషన్ లో ఉండేది అయితే ఇప్పుడు ఎన్ టీ వీ ఆ స్థానాన్ని ఆక్రమించగా, టీవీ 9 రెండవ స్థానానికి వచ్చింది. ఈ రేటింగ్ లను ఎలా డిసైడ్ చేస్తారో అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే విభాగం బీఏఆర్ కే టీవీ ఛానల్స్ లో వచ్చే ప్రోగ్రామ్ లను పరిశీలించి టీఆర్ పీ రేటింగ్ కేటాయిస్తారు. టీఆర్ పీ రేటింగ్ ఆధారంగానే కార్పోరేట్ సంస్థలు యాడ్స్ ఇస్తుంటాయి. 15 సెకన్ల యాడ్ కు మూడు లక్షలు తీసుకుంటే అదే టీఆర్ పీ ఎక్కువ ఉన్న ప్రొగ్రామ్ సమయంలో అదే సమయానికి పది పదిహేను లక్షల వరకూ తీసుకుంటారు. టీఆర్ పీ రేటింగ్ లే మీడియా సంస్థకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంటాయి.

TRP Rating Scam
 TRP Rating Scam

రేటింగ్ లను వారు ఎలా మ్యానిప్యూలేట్ చేస్తున్నారంటే ..?

ఇటువంటి టిఆర్ పీ రేటింగ్ లను వారు ఎలా మ్యానిప్యూలేట్ చేస్తున్నారంటే ..? మీడియా సంస్థలు కొందరి ఇళ్లకు వెళ్లి వాళ్ల టీవి సెటప్ బాక్స్ కు ఒక చిప్ పెడతారు. మీరు ఫలానా సమయంలో టీవీ ఆన్ చేసి మా ఛానల్ చూడండి అని చెబుతారు. ఏయే సమయంలో ఎంత సేపు టీవి ఆన్ చేయాలో చెబుతారు. అలా చూసినందుకు గానూ వాళ్లకు నెలకు ఇంత అని నగదు చెల్లిస్తుంటారు. న్యూస్ ఛానల్స్ అయితే రూ.500 నుండి వెయ్యి రూపాయల వరకూ ఇస్తున్నట్లు సమాచారం. ఎంటర్ టైన్ మెంట్ ఛానల్స్ రూ.వెయ్యి నుండి రెండు వేల వరకూ ఇస్తుంటాయి. ఈ తప్పుడు రేటింగ్ కు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ వ్యక్తి జగ్గయ్యపేట తదితర ప్రాంతాల్లో టీవీ విక్షకులతో మాట్లాడిన అంశాలను వీడియో ఆధారాలతో మీడియా సంస్థలకు పంపినా ఎవరూ దీనిపై స్పందించలేదు. ఎన్టీవీ చూస్తున్నారు కదా, నెల నెలా సక్రమంగా ఇస్తున్నారా అంటే ఆ గృహిని ఇస్తున్నారు అంటూ సమాధానం చెప్పింది. వీళ్లు వంద మందో 200 మందో ఇళ్లకు చిప్ లను అమర్చి ఇలా చేస్తుంటారు. ఫలానా సమయంలో ఈ ప్రోగ్రామ్ చూడండి అని చెబుతారు. దాంతో ఆ సమయంలో వాళ్లకు టీఆర్ పీ రేటింగ్ విపరీతంగా పెరుగుతుంది. దీన్ని చూపించుకుని వాళ్లు యాడ్ లను దండుకుంటారు. కొన్ని ఛానల్స్ ఇలా చేస్తున్నాయి.

ఏపి రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ హెల్త్ బులిటెన్ విడుదల .. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు ఏమి చెప్పారంటే..?


Share

Related posts

అక్కడ కూడా చేతులెత్తేసిన పవన్ కళ్యాణ్..??

sekhar

Ravi Teja: హీరో రవితేజ కి ఒక మంచి లాయర్ కావాలట.. మీకు ఎవరైన తెలుసా ..?

Ram

Atchan Naidu : అచ్చెన్నాయుడు అరస్ట్ అయిన 12 గంటల్లో మరొక టీడీపీ టాప్ లీడర్ అరస్ట్ అయ్యాడు..!!

sekhar