ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య మొదలైన బిగ్ బాస్ నాలుగో సీజన్ పైన ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు పైగా కంటెస్టెంట్స్ విషయంలో కూడా ఈసారి అంచనాలను అందుకోలేదని రూమర్స్ బాగా వచ్చాయి. అయితే రోజులు గడిచే కొద్ది అభిమానులు పెరిగారు. ప్రతి వారాంతం లో ఏదో ఒక స్పెషల్ ప్లాన్ చేసిన నిర్వాహకుల వ్యూహం ఫలించింది. ఇక ఆ తర్వాత రేటింగ్స్ కూడా తారాజువ్వలా పైకి వెళ్ళడం మొదలు పెట్టాయి. ఫైనల్స్ కు అయితే నెవర్ బిఫోర్ అనేలా రేటింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మూడు సీజన్స్ తో పాటుగా ఈ సంవత్సరం వచ్చిన రేటింగ్ వివరాలపై ఒక లుక్కేస్తే….
అన్ని సీజన్లలో ఫైనల్ రేటింగ్స్ మిగతా ఎపిసోడ్ లతో పోల్చుకుంటే ఎక్కువగా ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన మొదటి సీజన్ లో శివబాలాజీ విన్నర్ కాగా ఆదర్శ్ బాలకృష్ణ రన్నరప్ గా నిలిచాడు. అప్పుడు రేటింగ్ 14.23 వచ్చింది ఆ సీజన్ కు చీఫ్ గెస్ట్ ఎవరు రాలేదు. నాని హోస్ట్ గా ఉన్న రెండవ సీజన్ ఫైనల్ కు 15.05 రేటింగ్ దక్కింది. కౌశల్ క్రేజ్ కూడా దీనిలో ప్రధాన పాత్ర పోషించింది అని చెప్పాలి. ఆ ఫైనల్ కు ఛీఫ్ గెస్ట్ గా విక్టరీ వెంకటేష్ వచ్చి ట్రోఫీ అందించారు.
ఇక మూడవ సీజన్ లో నాగ్ వచ్చీరావడంతోనే కొత్త రికార్డు సృష్టించాడు. మూడో సీజన్ ఫైనల్ రేటింగ్స్ 18.29 రేటింగ్ తో ముగించాడు. రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్ గా, యాంకర్ శ్రీ ముఖి రన్నర్ గా నిలిచింది. మెగాస్టార్ చేతుల మీదుగా రాహుల్ ట్రోఫీ అందుకున్నాడు. ఇక ఈ సీజన్ ఫైనల్ రైటింగ్ గత రికార్డులను తిరగరాసింది. 19.5 రేటింగ్ ను నాలుగో సీజన్ ఫినాలే అందుకోవడం విశేషం. ఇక్కడ కూడా నాగార్జున హోస్ట్, చిరంజీవి గెస్ట్. ఈసారి అభిజిత్ టైటిల్ దక్కించుకోగా అఖిల్ రన్నరప్ గా నిలిచాడు
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?