TRS Leaders: అన్న కత్తితో.. తమ్ముడు గన్ తో..! టీఆరెస్ నాయకుల ఫ్యాక్షన్ తరహా వీరంగం..!!

TRS Leaders: Attacked like Faction Fights
Share

TRS Leaders:  తెలంగాణ రాష్ట్రంలో గన్ కల్చర్ ఇటీవల ఎక్కువవుతోంది.. నాయకులు తమకున్న పలుకుబడితో రివాల్వర్ లైసెన్స్ తెచ్చుకుని.. ఇష్టానుసారం వాడడం ఆ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తుంది. కొన్ని నెలల కిందట ఎంఐఎం నాయకుడు ఒకరు నిజామాబాద్ లో నడివీధిలోనే గన్ తో కాల్పులు జరిపిన ఘటన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినా సంగతి తెలిసిందే. తాజాగా నిన్న రాత్రి ఇద్దరూ అన్నదమ్ములైన టీఆరెస్ నాయకుల మధ్య వివాదం తలెత్తి ఒకరు కత్తితో దాడికి.., మరొకరు గన్ తో కాల్పులకు ఒకరిపై ఒకరు తెగబడ్డారు..! ఈ ఘటనపై వివరాలిలా ఉన్నాయి…. కరీంనగర్ సమీపంలోని షాషామహల్‌ ప్రాంతంలో ఆస్తి వివాదంలో ఐదుగురు సోదరుల మధ్య కొద్ది రోజులుగా వివాదం నడుస్తున్నది. అధికార పార్టీ నాయకుడు సయ్యద్‌ అజ్గర్‌ హుస్సేన్‌ .. వీరి తమ్ముళ్ల మధ్య గొడవ ఉంది. దీంతో నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో చిన్న సోదరుడు సయ్యద్‌ షహీల్‌ హుస్సేన్‌పై మొదట కత్తితో దాడి చేసాడు. మిగిలిన ముగ్గురు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ అతను ఆగలేదు. దీంతో కోపగించిన హుస్సేన్‌ తన వద్ద ఉంచుకున్న గన్ తీసి వారిపై రెండు సార్లు కాల్పులు జరిపాడు. అయితే కాల్పుల నుండి నలుగురు సోదరులు తప్పించుకున్నారు. కానీ ఈ బుల్లెట్లు వెళ్లి కారుకి తగిలి పెద్ద పెద్ద శబ్దాలతో ఆ ప్రాంతం మార్మోగింది. స్థానికులు భయకంపితులయ్యారు.

TRS Leaders: Attacked like Faction Fights
TRS Leaders: Attacked like Faction Fights

TRS Leaders: పోలీసుల విచారణలో మూలాల్లోకి…!!

స్థానికుల సమాచారం మేరకు.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా మూలాల్లోకి వెళ్లారు. కరీంనగర్‌ అడిషనల్‌ డీసీపీ ఎస్‌ శ్రీనివాస్‌, సిటీ అడిషనల్‌ డీసీపీ పీ అశోక్‌లు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. కాల్పులు జరిపిన అజ్గర్‌ నీ, ఆయన నలుగురు సోదరులని అదుపులోకి తీసుకున్నారు. కత్తిని స్వాధీనం చేసుకుని, గన్ కోసం వెతుకుతున్నారు. దీనిలో గమ్మత్తేమిటంటే… ఆ సోదరుల మధ్య ఎన్నాళ్ళ నుండీ వివాదం ఉన్నప్పటికీ అందరూ కలిసి ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. కమాన్‌ నుంచి హౌసింగ్‌బోర్డు కాలనీకి వెళ్లే రోడ్డులోనే ఐదుగురికి షటర్స్‌ ఉన్నాయి. దీని విలువ సుమారుగా రూ. 3 కోట్లు వరకు ఉంటుంది. దీన్ని అధికార బలంతో ఎవరికీ వారు కాజేయాలని పన్నాగం వేసినట్టు పోలీసులు గ్రహించారు. గతంలో అమ్మిన ఆస్తిని కూడా అఙ్గార్ ఒక్కడే కాజేశాడని.. దీన్ని కూడా అలాగే స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు ఎం,మిగిలిన సోదరులు పోలీసులకు తెలిపారు. మొత్తం ఘటనపై విచారణ జరిపిన పోలీసులకు తుపాకీ కానీ.. తుపాకీతో కాల్పులు జరిపిన ఆనవాళ్లు కానీ ఇంకా లభయం కాలేదు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.


Share

Related posts

ఇది జగన్ మార్క్ మాస్టర్ స్ట్రోక్ !చంద్రబాబు కంచుకోట బద్దలైంది !!

Yandamuri

YS Jagan : ఏంటిది జ‌గ‌న్ గారు…. ఇలా వాళ్ల‌ను బాధ పెట్ట‌డం క‌ర‌క్టేనా?

sridhar

బిగ్ బాస్ 4 : ముక్కు అవినాష్ దశ తిరిగిపోయింది…! భారీ సినిమా లో కమెడియన్ గా ఆఫర్…?

arun kanna