NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

‘చిన్నసారు’పై సిరిసిల్ల గులాబీ నేతల చిర్రుబుర్రు!సీఎం బిడ్డ గడ్డలోనే గడబిడ!

తెలంగాణ సిఎం కెసిఆర్ కుమారుడు కెటిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు పొలిటికల్​ సర్కిల్​లో హాట్​టాపిక్​లా మారాయి. ​

పార్టీలో మొదటి నుంచీ ఉంటున్న తమకు మంత్రి కేటీఆర్ కనీస విలువ ఇవ్వట్లేదని, సమస్యలు చెప్పుకునేందుకు హైదరాబాద్​ వెళ్తే అపాయింట్​మెంట్ కూడా​దొరకట్లేదని నియోజకవర్గానికి చెందిన టీఆర్​ఎస్​ సీనియర్లు, ప్రజాప్రతినిధులు కొన్నాళ్లుగా అసంతృప్తితో రగిలిపోతున్నారు. కాంగ్రెస్​ నుంచి వలసొచ్చిన ఓ నలుగురు లీడర్ల మాటలనే చిన్న సారు వింటున్నారని, వాళ్లు చెప్పినట్టే నడుచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల దుబ్బాక, జీహెచ్​ఎంసీ ఎలక్షన్స్​లో బీజేపీ పుంజుకొని టీఆర్​ఎస్​ డీలా పడడంతో సిరిసిల్ల నియోజకవర్గంలోని ​టీఆర్​ఎస్​ అసంతృప్త నేతలంతా ఒక్కసారిగా వాయిస్​ రేజ్​​చేశారు. సిరిసిల్ల పక్క మండలంలోని ఓ మామిడితోటలో సీనియర్లు, ప్రజాప్రతినిధులంతా ఓ మీటింగ్​ పెట్టారు. ఇకనైనా మంత్రి కేటీఆర్​ తమను పట్టించుకోకపోతే మూకుమ్మడిగా బీజేపీలోకి జంప్​అవుతామని  హెచ్చరించారు.

జంపింగ్ జిలానీలకు పెద్దపీట!

టీఆర్​ఎస్​లో మొదటి నుంచీ ఉంటున్నవారిని కాదని ​కాంగ్రెస్​ నుంచి వలసొచ్చిన లీడర్లకే  మంత్రి కేటీఆర్ ప్రియారిటీ ఇస్తున్నారని సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన టీఆర్​ఎస్​ సీనియర్లు, ప్రజాప్రతినిధులు కొద్దిరోజులు గా అసంతృప్తిలో ఉన్నారు. ఇందుకు తగినట్లే ఇటీవల నాలుగు మండలాల్లో అగ్రికల్చర్​ మార్కెట్​ కమిటీ లకు చైర్మన్​ పదవులు ప్రకటించగా, అన్నీ కొండూరి రవీందర్​రావు వర్గీయులకే దక్కాయి. అందులో ముగ్గురు కాంగ్రెస్​ నుంచి వలస వచ్చినవారే. తాము పంపిన లిస్టును పూర్తిగా పక్కనపెట్టేయడంతో మిగిలిన లీడర్లు నారాజ్​ అయ్యారు. ఇదిలా ఉంటే సిరిసిల్లలోని పద్మశాలీ కులానికి చెందిన టీఆర్​ఎస్​ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్​కు స్టేట్​లెవల్​ పదవి ఇస్తామని నాలుగేండ్ల కింద  కేటీఆర్​ హామీ ఇచ్చి మరిచిపోయారు. దీనిపై ఆ కులానికి చెందిన నేతల్లో అసంతృప్తి నెలకొంది. దీనికి తోడు కేటీఆర్​ మేనబావ చీటీ నర్సింగరావు తాను​ సిరిసిల్లలో తెలంగాణ ఉద్యమం కాలం నుంచి పని చేస్తున్నా ఇప్పటికీ ఒక్క  పదవి ఇవ్వలేదని బహిరంగంగానే తన ఆవేదన వెళ్లగక్కుతున్నారు. ఇక ఊళ్లలో విలేజ్​పార్కులు, శ్మశానాలు, డంప్​యార్డులు, రైతువేదికలు కట్టి సర్కారు నుంచి ఫండ్స్​ రాక అందరిలాగే టీఆర్​ఎస్​ సర్పంచులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫండ్స్​ లేక ఊళ్లలో డెవలప్​మెంట్​ పనులు చేయలేకపోతున్నామని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఆవేదన చెందుతున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో కనీసం ఎమ్మెల్యేల వద్ద తమ గోడు చెప్పుకొని కాస్త రిలాక్స్​ అవుతున్నా సిరిసిల్ల నియోజకవర్గంలోని టీఆర్​ఎస్ ప్రజాప్రతినిధులకు ఆ పరిస్థితి కూడా లేకుండా పోయింది. రెండోసారి గెలిచాక మంత్రి కేటీఆర్​ సిరిసిల్ల సెగ్మెంట్​కు రావడం తగ్గింది. ఒకవేళ  వచ్చినా ఏవేవో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు పెట్టుకొని హడావుడిగా వెళ్లిపోతున్నారు. హైదరాబాద్​లో కలుద్దామంటే
అపాయింట్​మెంట్​ దొరకట్లేదని సిరిసిల్ల లీడర్లు అంటున్నారు.

అలర్ట్ అయిన కేటిఆర్!

ఈ విషయాలన్నీ కేటీఆర్ కి తెలియడంతో ఆయన నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు.  నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, సీనియర్లతో మాట్లాడేందుకు వారం రోజుల షెడ్యూల్​ ప్రకటించి, ఆయా రోజుల్లో హైదరాబాద్​ రావాలని ఆహ్వానం పంపారు. ఇకపై తాను అందరికీ అందుబాటులో ఉంటానని, ఏ విషయమైనా లీడర్లందరి అభిప్రాయాలు తీసుకున్నాకే ముందుకెళ్తానని కేటీఆర్​ నచ్చజెప్పినట్లు తెలిసింది. ఎవరూ నారాజ్​ కావొద్దని, పార్టీ మారే ఆలోచన మనసులోకి రానివ్వొద్దని సిరిసిల్ల నేతలకు ఆయన సూచించినట్లు సమాచారం.

 

author avatar
Yandamuri

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju