NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

TRS MLA: ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి తిరుగుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే!ఏమిటా కథా కమామిషు?

TRS MLA: ఆవేశంలో నోరు జారితే పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడిప్పుడే ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు అర్థమవుతోంది.నోటికొచ్చినట్లు మాట్లాడితే ఏమవుతుందో ఆయనకు జనాలే అర్థమయ్యేలా చెబుతున్నారు.దీంతో సదరు ఎమ్మెల్యే ఫోన్ ను స్విచాఫ్ చేసుకునే వరకూ పరిస్థితి వచ్చింది.

TRS MLA switchted off his phone!
TRS MLA switchted off his phone

TRS MLA: అసలేం జరిగిందంటే?

వివరాల్లోకి వెళితే.. అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఈమధ్య హుజూరాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకొని చేసిన ప్రకటన ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది.ఈ ఎన్నికలపై ఒక ఛానెల్ డిబేట్ నిర్వహించినప్పుడు అందులో పాల్గొన్న బాలరాజు రాజేందర్ గెలిచే ప్రసక్తే లేదని ఆ డిబేట్ లో బల్లగుద్ది చెప్పారు.అంతటితో ఆగకుండా హుజూరాబాద్ ఉపఎన్నికలో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆవేశంగా ప్రకటించారు.

TRS MLA: ఇప్పుడేమి జరుగుతున్నదంటే!

అయితే బాలరాజు అంచనాలు తలకిందులయ్యాయి హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ మీద దాదాపు పాతిక వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.దీంతో కేసీఆర్,కేటీఆర్ లకే దిమ్మతిరిగింది.అదే సమయంలో బాలరాజుకు కష్టాలు మొదలయ్యాయి.ఈ ఉప ఎన్నికలో రాజేందర్ గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న బాలరాజు సవాల్ ను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టింగులు వెల్లువెత్తుతున్నాయి. గువ్వల బాలరాజు ఎక్కడంటూ,ఎప్పుడు రాజీనామా చేస్తారంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సూటిగా ప్రశ్నిస్తున్నారు మీమ్స్ తో ఉతికి ఆరేస్తున్నారు. కొందరైతే నేరుగా ఈ విషయం అడగడానికి ఆయన మొబైల్ ఫోన్లు చేయటం ప్రారంభించారు.ఈ బాధ పడలేక గువ్వల బాలరాజు తన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారు.ఇంట్లోనే ఉండి లేడని చెప్పిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

గతంలో బండ్ల గణేష్ కూ ఇదే గతి

సినీ నిర్మాతగా ఉంటూ కాంగ్రెస్ లో చేరి రాజకీయ ఆరంగేట్రం చేసిన బండ్ల గణేష్ గతంలో ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గనుక తెలంగాణాలో అధికారంలోకి రాకుంటే నాలుక కోసుకుంటానని ఆయన మీడియా సమావేశంలో ప్రకటించారు.అంత అంతేగాక తనకు కాంగ్రెస్ టిక్కెట్ లభించి గెలిచి ఎమ్మెల్యే అయినట్లు ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు ఒక వీడియో కూడా విడుదల చేశారు.ఆ రెండు జరగకపోవడంతో బండ్ల గణేష్ ను నెటిజన్లు ఓ ఆటాడుకున్నారు. ఇప్పుడు గువ్వల బాలరాజు వంతు వచ్చింది.

 

author avatar
Yandamuri

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju