NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు .. 6న విచారణకు హజరుకావాలంటూ..

Breaking:  ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ 160 సెక్షన్ కింద కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 6వ తేదీ ఉదయం 11 గంటలకు విచారణ జరుపుతామని, హైదరాాబాద్ లేదా ఢిల్లీలో ఎక్కడ అందుబాటులో ఉంటారో తెలపాలని సీబీఐ నోటీసులో వెల్లడించింది. సీబీఐ నోటీసులు జారీ చేసిన అంశాన్ని ఎమ్మెల్సీ కవిత దృవీకరించారు. డిసెంబర్ 6న తన నివాసం వద్దనే వివరణ ఇస్తానని కవిత వెల్లడించారు.

TRS MLC Kavitha

 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రముఖ వ్యాపారి అమిత్ అరోరాను అరెస్టు చేసిన తర్వాత రిమాండ్ రిపోర్టులో ఈడీ తొలి సారిగా కవిత పేరును ప్రస్తావించింంది. కవితతో సహా పలువురు పేర్లు ప్రస్తావించిన ఈడీ వారు ఆధారాలను మాయం చేసేందుకు వారు వాడిన ఫోన్ లను ధ్వంసం చేసినట్లుగా పేర్కొంది. ధ్వంసం చేసిన సెల్ ఫోన్ల విలువే 1.30 కోట్లు ఉంటుందని ఈడీ స్పష్టం చేసింది. తొలి సారిగా కవిత పేరు ఈడీ ప్రస్తావించిన నేపథ్యంలో ఆమె మీడియా సమావేశంలో కేంద్రంలోని బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

CBI

 

మోడీ వచ్చే ముందు రాష్ట్రాలకు ఈడీ వస్తుందని కవిత విమర్శించారు. ఎటువంటి విచారణకు కైనా తాను సిద్దమేనని తెలిపారు. ఇదంతా కేంద్రంలోని బీజేపీ కుట్రగా ఆమె విమర్శించారు. కవితకు సీబీఐ నుండి నోటీసులు రావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. గతంలో ఢిల్లీలో బీజేపీ నేతలు .. లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఉందంటూ ఆరోపణలు చేయడం తీవ్ర సంచలనం అయ్యింది. తెలంగాణలోనూ ప్రతిపక్ష పార్టీలు కవితపై లిక్కర్ స్కామ్ ఆరోపణలు చేస్తూ విమర్శలు చేయడంతో కోర్టును ఆశ్రయించి ఆర్డర్ పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు నేరుగానే ఈడీ .. అమిత్ ఆరోరా రిమాండ్ కవిత పేరును ప్రస్తావించడం, మరో పక్క సీబీఐ నోటీసులు జారీ చేయడంతో ప్రతిపక్షాలకు ఆయుధం దొరికినట్లు అయ్యింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju