NewsOrbit
న్యూస్

రాజ్యసభలో బీజేపీకి బలం లేకున్నా.. వ్యవసాయ బిల్లును ఎలా ఆమోదిస్తారు?.. టీఆర్ఎస్ ఎంపీ కేకే

trs mp k keshava rao fires on union farm bills

టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులు రైతులకు ఏమాత్రం ఉపయోగపడేవి కావని కేశవరావు స్పష్టం చేశారు. ఈ బిల్లు వల్ల రైతులకు గిట్టుబాటు ధర పెరుగుతుందని బీజేపీ హామీ ఇవ్వగలదా? అని ప్రశ్నించారు.

trs mp k keshava rao fires on union farm bills
trs mp k keshava rao fires on union farm bills

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కూడా పూర్తిగా కేంద్రానికి పక్షపాతంగా వ్యవహరించారని కేకే మండిపడ్డారు. అసలు.. బీజేపీకి రాజ్యసభలో బలమే లేదు. అయినప్పటికీ.. సభలో వ్యవసాయ బిల్లును ఎలా ఆమోదింపజేసుకున్నారు.. అంటూ ఎంపీ మండిపడ్డారు.

నా 60 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఇలాంటి ఘటనను చూడలేదు. ఇలా నిబంధనలకు వ్యతిరేకంగా ఏ బిల్లు కూడా ఇప్పటి వరకు ఆమోదం పొందలేదు. వ్యవసాయ రంగాన్ని బీజేపీ కార్పొరేట్ మయం చేయబోతోంది. బిల్లుపై ప్రతిపక్షాలు సవరణలు ప్రతిపాదించినా పట్టించుకోలేదు. డిప్యూటీ చైర్మన్ వాటిని అసలు పరిగణనలోకే తీసుకోలేదు.. అంటూ కేకే వెల్లడించారు.

టీఆర్ఎస్ పార్టీ తరుపున రాజ్యాంగ వ్యతిరేక బిల్లుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాం. డిప్యూటీ చైర్మన్ కేంద్రానికి పక్షపాతం వ్యవహరించడాన్ని నిరసిస్తూ.. ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మాన్ని పెట్టారు. దానికి టీఆర్ఎస్ ఎంపీలందరం మద్దతిచ్చాం. మొత్తం 12 పార్టీలు డిప్యూటీ చైర్మన్ కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చాయి. 50 మంది ఎంపీలు సంతకాలు పెట్టారు. ఓవైపు అవిశ్వాస తీర్మానం పెండింగ్ లో ఉన్నప్పుడు… సభకు చైర్మన్ గా ఉండే అవకాశం డిప్యూటీ చైర్మన్ కు ఉండదు. కానీ.. నిబంధనలను తుంగలో తొక్కి వ్యవసాయ బిల్లును ఆమోదింపజేసుకున్నారని కేకే మండిపడ్డారు.

ఇక.. ఇప్పటికే లోక్ సభలో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులను.. మూజువాణి ఓటుతో రాజ్యసభలోను ఆమోదింపజేసుకున్నారు. రాజ్యసభలో వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందినట్టుగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ ప్రకటించారు.

author avatar
Varun G

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju