NewsOrbit
న్యూస్

TRS MPs: పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించిన టీఆర్ఎస్..! ముందే చెప్పిన రేవంత్ రెడ్డి..!!

TRS MPs: పార్లమెంట్ నుండి టీఆర్ఎస్ ఎంపిలు మాయమవబోతున్నారు అంటూ ఒక రోజు ముందుగానే టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి వెల్లడించినట్లుగానే నేడు టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తీరును నిరసిస్తూ పార్లమెంట్ సమావేశాలను టీఆర్ఎస్ బహిష్కరించింది. వారం రోజులుగా పార్లమెంట్ వేదికగా టీఆర్ఎస్ ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడంతో పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించినట్లు టీఆర్ఎస్ ఎంపీలు ప్రకటించారు. తదుపతి కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్లమెంటరీ నాయకుడు కే కేశవరావు మాట్లాడుతూ సభను బాయ్ కాట్ చేయడం బాధకల్గించే విషయమన్నారు. కేంద్రంలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఆయన ఆరోపించారు. తెలంగాణ నుండి బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని కేంద్రం చెబుతోందన్నారు. రబీలో పూర్తిగా ఉప్పుడు బియ్యం మాత్రమే వస్తుందన్నారు. అందుకే రబీ ధాన్యం బాయిల్డ్ రైస్ గా మారుస్తామన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఎఫ్ సి ఐ నిర్లక్ష్య వహిస్తోందని ఆయన విమర్శించారు. యార్డ్ ల్లో ఉన్న ధాన్యాన్ని ఎఫ్ సీ ఐ తరలించకపోవడంతో ధాన్యం పాడైపోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

TRS MPs boycott parliament session
TRS MPs boycott parliament session

 

TRS MPs: రేవంత్ చెప్పినట్లుగా టీఆర్ఎస్ ఎంపీల చర్యలు

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. టిఆర్ఎస్ ఎంపీలు మంగళవారం నుండి పార్లమెంట్ లో నిరసనలు ఉండవనీ, మధ్యాహ్నం తర్వాత వారు పార్లమెంట్ నుండి మాయమవబోతున్నారని రేవంత్ రెడ్డి ముందే వెల్లడించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని రేవంత్ మండిపడ్డారు. కేంద్రం నుండి తెలంగాణ సర్కార్ కు ఆదేశాలు అందడం వల్లనే టీఆర్ఎస్ ఎంపీలు నిరసనలు ఆపేసి వెళ్లిపోతున్నారని పేర్కొనడం గమనార్హం. తెలంగాణ రైతుల ఇబ్బందులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ ఎంపీలు నామమాత్రంగా నిరసలు తెలుపుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ఎంపిలు ఏమి చేయబోతున్నారు అన్న విషయాన్ని ముందగా రేవంత్ రెడ్డి చెప్పడంతో ఆయనకు టీఆర్ఎస్ లో కోవర్టులు ఉన్నారా అన్న అనుమానం కలుగుతోంది. రేవంత్ వ్యాఖ్యలకు అనుగుణంగానే టీఆర్ఎస్ ఎంపీల చర్యలు ఉండటంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju