NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ మీడియా

తలసేమియాకు “”కావ్య”” కల్ప చికిత్సతో నయం

 

ఒక చిట్టి దేవత… వయసు 10 నెలలు.. అలా అలా నడుచుకుంటూ దివి నుంచి గుజరాత్ లోని అహ్మదాబాద్ వచ్చేసింది.. కష్టాల్లో ఉన్న సోలంకి ఇంటికి వెళ్లి దేవతలా నవ్వింది. అప్పటికె చావు బతుకుల మధ్య ఉన్న సోలంకి కొడుకు 6 ఏళ్ల బాలుడ్ని తాకింది. తనలో నిక్షిప్తమై ఉన్న మహిమను ప్రసరింపచేసింది. అతడికి నిండు నూరేళ్ళ ఆయుస్సు పోసింది… ఆ ఇంటికి నిండు పున్నమి తెచ్చింది… ఇదేంటి పేదరాశి పెద్దమ్మ కథ అనుకుంటున్నారా?? దానికన్నా పెద్ద కథే ఒకసారి మొత్తం చదివేయండి….
# సహదేవ్ సిన్హా సోలంకి అహ్మదాబాద్ లో ఒక మధ్యతరగతి వ్యక్తి. వ్యాపారి. మొదట పాప తర్వాత లేకలేక పుట్టిన కొడుకు అభిజిత్. ఎంతో ముచ్చట పడిన సోలంకి దంపతుల కన్న కొడుకు ఆశలు 10 నెలకు రాగానే తల్లకిందులయ్యాయి. అభిజిత్ కు తలసీమియా వ్యాధి నిర్ధారణ అయ్యింది.
# తలసేమియాకు చికిత్సహ లేదు. మందులు వాడటమే కాదు. ప్రతీ 20-22 రోజులకొకసారి 350-400 మి.లీ. రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుంది. అభిజిత్కు ఆరేళ్లు నిండేటప్పటికి 80సార్లు రక్తాన్ని ఎక్కించారు సహదేవ్‌సిన్హ్ సోలంకి దంపతులు.


# సోలంకి తలసీమియా చికిత్స గురించి తెలుసుకోవడం మొదలెట్టాడు. ఎన్నో అన్వేషణలు చేసాడు .. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా తలసేమియాను నయం చేయవచ్చని ఒక జనరల్ లో వచ్చిన వ్యాసం చదివాకా దానిపై పరిశోధన సాగించాడు. అయితే తన ఇంట్లోని వారి బోన్ మ్యారో తో అభిజీత్ బోన్ మ్యారో మ్యాచ్ అవ్వలేదు. దింతో మరింత దుఃఖం పొంగింది .
#2017లో ఆయనకి ‘రక్షక తోబుట్టువు (సేవియర్ సిబ్లింగ్)’ ప్రక్రియ గురించి తెలిసింది. ఈ విధానంలో తనకన్నా ముందు పుట్టినవారికి అవయవాలు, కణాలు, బోన్ మ్యారో దానం చెయ్యడం కోసమే ఒక పిండాన్నిసృష్టించి ప్రాణం పోస్తారు. అంటే సృష్టికి పున సృష్టి లాంటిది . ఒక మనిషిని రక్షించడం కోసం బోన్ మ్యారో మ్యాచ్ అయ్యే మరో ప్రాణిని పుట్టించడం.
# ఈ మధ్యలో యూఎస్‌లో అభిజీత్‌కు మ్యాచ్ అయ్యే బోన్ మ్యారో దొరికింది. అయితే దానికి 50 లక్షలనుంచీ ఒక కోటి దాకా ఖర్చవుతుంది. అంతేకాకుండా దాత, వీరికి సంబంధీకులు కాకపోవడం వలన బోన్ మ్యారో మార్పిడి విజయవంతమయ్యే అవకాశాలు 20-30 శాతం మాత్రమే ఉంటాయి. దింతో మరోమారు నిరాశ..
# ఇక చివరకు ఇండియాలో ప్రసిద్ధి చెందిన సంతానోత్పత్తి నిపుణులు డాక్టర్ మనీష్ బ్యాంకర్‌ని కలిసారు. అభిజీత్ చికిత్స కోసం తలసేమియా లేని పిండాన్ని తయారుచెయ్యమని అభ్యర్థించారు.
# అలా ఇంటి దేవత ఉద్భవించింది. కావ్యగా అన్నకు ప్రాణ కావ్యమే రాసింది. కావ్య పుట్టుకకు ఉపయోగించిన సాంకేతికతను ‘ప్రీ-ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్’ అంటారు. దీని ద్వారా వ్యాధికి కారణమయ్యే జన్యువును పిండం నుంచీ తొలగిస్తారు. ఇండియాలో ఈ పద్ధతిని గత కొన్నేళ్లుగా ఉపయోగిస్తున్నారు. కానీ రక్షక తోబుట్టువును సృష్టించడానికి వాడడం ఇదే మొదటిసారి. అలా పుట్టిన కావ్యకు సుమారు 18 నెలలు దాటిన తర్వాత బోన్ మ్యారో ను అన్న అభిజిత్కు ఇచ్చి అతడిని నూరేళ్లు అందించింది. ఎముక మజ్జ (బోన్ మ్యారో ) తీసిన తర్వాత కావ్య అపాయం లోకి వెళ్ళింది. తీవ్రమైన నొప్పి భరించింది. అయితే కొన్ని నెలల చికిత్స తర్వాత అన్నాచెల్లి ఇద్దరు హాయిగా ఉన్నారు. ఎప్పుడు అభిజిత్కు 7 నెలల నుంచి రక్తం ఎక్కించుకున్న నవ్వుతు తుళ్ళుతూ ఆడుకుంటున్నాడు. అలా ఆ ఇంట పుట్టిన కావ్య కొత్త కాంతులు నింపింది. ఒక సృష్టి ద్వారా మరో సృష్టిని కాపాడే పేదరాశి పెద్దమ్మ కథ లాంటి నిజ జీవిత గాధ ఇది.

 

 

 

author avatar
Special Bureau

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju