వ్యక్తిగత సిబ్బంది కొంపముంచిన ట్రంప్ కోపం..!!

డోనాల్డ్ ట్రంప్ వ్యవహారం విదేశాలకు మాత్రమే కాకుండా సొంత సిబ్బందికి కూడా చిక్కులు తెచ్చి పెట్టినట్లు అంతర్జాతీయంగా వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే అమెరికా ప్రజాస్వామ్యం ప్రకారం అధ్యక్షులు దగ్గరికి వచ్చే ప్రతి ఫైలు అదే విధంగా ప్రతి పేపర్ బాధ్యతాయుతంగా అధికారులు దాచి పెట్టాలి.

Trump went 'ballistic' after being tossed off Twitter - POLITICOఇప్పుడున్న నాయకుడు వెళ్లిపోయిన తర్వాత నాయకుడికి క్లారిటీ ఉండేలా అమెరికా యొక్క రూల్ అది. కానీ అధ్యక్షుడిగా ట్రంపు తన దగ్గరికి ఎటువంటి పేపర్లు వచ్చినా ఆ సమయంలో కోపం వస్తే వెంటనే.. పేపర్లు మొత్తం చించేసే అలవాటు ఉందట. దీంతో ప్రస్తుతం ఇటీవల జరిగిన ఎన్నికలలో ఆయన ఓడిపోవడంతో రాబోతున్న డెమోక్రటిక్ ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లు..అధ్యక్షుడిగా ట్రంపు హయాంలో వచ్చిన ప్రతి ఫైల్, పేపర్ పై ఆరా తీయడానికి నూతన అధ్యక్షుడు జో బిడెన్ రెడీ అవుతున్నట్లు సమాచారం.

 

దీంతో డోనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం రాబోయే రోజుల్లో ఉన్నట్లు అమెరికా మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే జో బిడెన్ అధ్యక్ష ప్రమాణస్వీకారానికి ట్రంపు హాజరయ్యే అవకాశం లేనట్లు సమాచారం.