అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అంటేనే ఒంటికాలిమీద లేస్తున్నాడు. ఇప్పటికే భారత్ చైనా వారికి సంబంధించిన యాభై తొమ్మిది యాప్స్ ను బహిష్కరించిన తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ ఆయన ట్వీట్ కూడా వేశారు.
ఇక ప్రపంచంలో కరోనా వైరస్ కారణంగా బాగా నష్టపోయిన దేశం అమెరికా. దీంతో అగ్రదేశపు ట్రంప్ చైనా మీద పీకల వరకు కోపంతో ఉన్నారు. ప్రపంచం మొత్తం ఇలా నాశనం కావడానికి కారణం చైనా దేశమే అని మరియు వారి వల్లే ప్రపంచంలో అశాంతి నెలకొందని ఆయన విమర్శించారు.
ఇప్పటికే అమెరికాకు వైరస్ వల్ల ఈ స్థితి పట్టడానికి డబ్ల్యూహెచ్వో ను కారకులుగా చూపిన ట్రంపు వారికి ఇవ్వాల్సిన నిధులను ఆపివేసిన విషయం తెలిసిందే. ఇక చైనా వారికి కూడా వ్యాపార లావాదేవీలను ఆపివేసేందుకు మరియు అన్ని సంబంధాలను తెగతెంపులు చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.