హెచ్-1 బి వీసాలలో మార్పులు తప్పనిసరిగా చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. వీసా విధానాల్లో మార్పులు తీసుకు రావడం వల్ల అమెరికా పౌరసత్వం పొందేందుకు దోహదపడుతుంది అని ఆయన అన్నారు. శుక్రవారం నిర్వహించిన ఒక సమావేశంలో హెచ్ 1బి వీసాల జారీ అంశాన్ని ప్రస్తావిస్తూ . . అత్యంత నైపుణ్యం ఉన్నవారికి మాత్రమే ఈ వీసా లు అందేలా చేస్తామన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ట్రంప్ ప్రకటించారు.
హెచ్ 1బి వీసా విధానంలో త్వరలో మార్పులు చేయనున్నాము . దీని వల్ల వీసా విధానంలో సరళ త్వం , ఖచ్చితత్వంతో పాటు పౌరసత్వం లభించేందుకు కూడా అవకాశం లభిస్తుంది.
కెరీర్ కోసం అమెరికాను ఎంవరచునే ప్రతిభ నైపుణ్యం ఉన్న ప్రజలను ప్రోత్సహిస్తామని ట్రంప్ పేర్కొన్నారు.